అచ్చోసిన ఆంబోతుల్లా తండ్రీకొడుకుల మాట‌లు 

నువ్వెక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో చెప్పు లోకేశ్

తండ్రీ కొడుకులకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేదు

వైయస్ కుటుంబం మంచిని ఎంచుకుంటే.. నారా కుటుంబం చెడును ఎంచుకుంది

అన్న‌మ‌య్య జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

రాయ‌చోటి: అచ్చోసిన అంబోతుల్లా తండ్రీకొడుకులు బూతులు మాట్లాడుతున్నార‌ని, రాష్ట్రంపై చంద్ర‌బాబు, లోకేష్ కోపంతో ర‌గిలిపోతున్నార‌ని అన్న‌మ‌య్య జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గురించి మాట్లాడే క‌నీస అర్హ‌త కూడా నారా లోకేష్‌కు లేద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగు క్యాంపు బెల్ ఆస్ప‌త్రిలో పుట్టార‌ని చెప్పారు. ముందు నువ్వెక్క‌డ పుట్టావో, ఎక్క‌డ పెరిగావో లోకేష్ తెలుసుకోవాల‌న్నారు. బూతులే రాజకీయం అనుకుంటే లోకేష్ కంటే ఎక్కువ మాట్లాడగలమ‌ని, కానీ, మా నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్‌ మాకు సంస్కారవంతమైన రాజకీయాలు నేర్పారని చెప్పారు. వైయ‌స్ఆర్ జిల్లాలోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎన్నికల సమయంలో ఆడపడుచులను మోసం చేసిన చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు మళ్లీ రోడ్లమీద తిరగడానికి సిగ్గుగా లేదా..? అని ఈ సంద‌ర్భంగా గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. కరోనా సమయంలో రాష్ట్రం నుంచి పారిపోయి హైదరాబాద్ లో దాక్కున్న తండ్రీకొడుకుల‌కు రాష్ట్రం గురించి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. రాష్ట్రంపై చంద్రబాబు, లోకేష్ లు కోపంతో రగిలి పోతున్నార‌ని, ప్రతీదానికి స్టే తెచ్చుకుని స్టే లపై బతికే వారు సీబీఐ కేసులు గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ కేసులనైనా ధైర్యంగా ఎదుర్కొంటున్నామ‌ని, చంద్ర‌బాబులా స్టేలు తెచ్చుకోవ‌డం లేద‌ని చుర‌క‌లంటించారు.  

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం మంచిత‌నానికి ప్ర‌తిరూప‌మ‌ని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. వైయస్ కుటుంబం మంచితనం ఎంచుకుంటే.. నారా కుటుంబం చెడును ఎంచుకుందన్నారు. చంద్రబాబు, లోకేష్ వారి యాత్రలలో జనాలు లేరని ఫ్రస్టేషన్ తో ఏదేదో మాట్లాడుతున్నారని, భరిస్తున్నామ‌ని ఇంకా ఎక్కువ‌ మాట్లాడితే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను హెచ్చ‌రించారు. లోకేష్ తెలుగు భాషా ప్రావీణ్యం ఏమిటో రాష్ట్రమంతా చూస్తోంద‌న్నారు. 

చంద్ర‌బాబు సొంత ఊరిలో ఎందుకు పోటీ చేయలేక పోయాడో నారా లోకేష్ స‌మాధానం చెప్పాల‌ని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోకేష్‌కైనా సొంత ఊరైన నారావారిపల్లెలో పోటీ చేసే దమ్ముందా..? అని ప్ర‌శ్నించారు. తండ్రీ కొడుకులకు రాయలసీమ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేదన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ తన పాదయాత్రలో ప్రజలకు సంక్షేమం,అభివృద్ది ఎలా చేస్తానో చెప్పారని, చంద్ర‌బాబు, లోకేష్‌లా రోడ్లెక్కి బూతుల దండకం చదవలేదన్నారు. లోకేశ్ కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవకుండా మంత్రి అయిపోయాడని ఎద్దేవా చేశారు. అధికార దాహంతో లోకేశ్, చంద్రబాబు రోడ్ల మీదప‌డి తిరుగుతున్నార‌న్నారు. 

రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కంటే మిన్నగా సంక్షేమం, అభివృద్ధి చేస్తాం అని చెప్పే దమ్ము చంద్ర‌బాబు, లోకేష్‌ల‌కు ఉందా..? అని ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో మీ తండ్రీకొడుకుల‌కంటే పెద్ద సైకోలు ఎవరు లేర‌న్నారు. తిట్ల దండకంతో మాట్లాడే కంటే టీడీపీని క్లోజ్ చేసుకుంటే మంచిదని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌జలను సోమరి పోతులను చేస్తున్నారని అంటూనే.. మళ్లీ అవే సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం అని చెప్ప‌డానికి సిగ్గులేదా..? తండ్రీకొడుకుల కల్లబొల్లి హామీలు ప్ర‌జ‌లెవ‌రూ న‌మ్మ‌ర‌ని ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top