అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని ధ్వజమెత్తారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ పోరాటానికి సిద్ధమైందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. శనివారం అనంతపురంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు.