‘వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ ప్రారంభం

ల్యాప్‌టాప్‌ బటన్‌ నొక్కి  నేత‌న్న‌కు ‌రూ.24 వేల చొప్పున సాయం అందించిన సీఎం వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రెండవ సంవత్సరం ‘వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా చేనేత కష్టాల గురించి, ప్రభుత్వం అందిస్తున్న మంచి గురించి వివిధ జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. అనంతరం ల్యాప్‌ టాప్‌లో బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 81.024 మంది చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వారి బ్యాంక్‌ అకౌంట్లలో సీఎం జమ చేశారు. అంతేకాకుండా చేనేత సొసైటీలకు గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు, కోవిడ్‌–19 సమయంలో రాష్ట్ర ప్రజలకు మాస్కులు పంపిణీ చేసేందుకు ఆప్కో నుంచి కొనుగోలు చేసిన క్లాత్‌కు సంబంధించిన రూ.109 కోట్ల బకాయిలను సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారు. అర్హత ఉండి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా పొరపాటున సాయం అందనివారి కోసం మరో నెల రోజుల గడువు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి వచ్చే నెల 20వ తేదీన సాయం అందిస్తామన్నారు. 
 

Back to Top