తెలుగు ప్రజల గుండెల్లో మహానేత వైయస్‌ఆర్‌ పదిలం

వైయస్‌ఆర్‌ సీఎం వైయస్‌ జగన్‌ రూపంలో ఉన్నారు

తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలన

ప్రతీ కార్యకర్త జగనన్న మనుషులమని గర్వంగా చెప్పుకునేలా పాలన

ఆంధ్రరాష్టాన్ని అగ్రగామిగా నిలిపేలా సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్‌ఆర్‌ జయంతి వేడుకలు

పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు

తాడేపల్లి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల్లో గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటారని, ఆయన్ను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ మరణించినా ఆయన పాలన ఆగలేదని, వైయస్‌ఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన సాగిస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రూపంలో వైయస్‌ఆర్‌ ఉన్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆత్మశాంతి కలిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఈతరం యువత సీఎం వైయస్‌ జగన్‌ తండ్రి వైయస్‌ఆర్‌ అని గర్వంగా చెప్పుకునేలా పరిపాలన చేస్తున్నారన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించిన అనంతరం భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 

వైయస్‌ఆర్‌ మరణించినా ఆయన పాలన మన కళ్లముందే మరింత మెరుగ్గా ఉంది. వైయస్‌ఆర్‌ తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ సువర్ణ పాలన అందిస్తున్నారు. వైయస్‌ఆర్‌ పాలన ఇలాగే ఉండేదా అని ఈతరం వారు అనుకునేలా పరిపాలన చేస్తున్నారు. తండ్రి వెళ్తూ వెళ్తూ తన కొడుకును మనకు అప్పగించి, తన కొడుక్కు మనల్ని అప్పజెప్పి వెళ్లడం ప్రపంచంలోనే అరుదుగా జరిగే సంఘటన. 

2009 పార్లమెంట్‌ ఎన్నికల్లో తన కొడుకు వైయస్‌ జగన్‌ను వైయస్‌ఆర్‌ ప్రజలకు అంకితం చేశారు. ఆ తరువాత కొద్ది కాలంలోనే వైయస్‌ఆర్‌ మనకు దూరమయ్యారు. వైయస్‌ జగన్‌ రూపంలో ఆరోజు నుంచి ఆ అడుగులు మరింత బలంగా పడుతూ వస్తున్నాయి. వైయస్‌ఆర్‌ సీఎం వైయస్‌ జగన్‌ రూపంలో ఉన్నారు. వైయస్‌ఆర్‌ మంచితనం, ప్రేమ, దార్శనికత, ప్రతి లక్షణం మరింత మెరుగ్గా, పదునుగా, ప్రేమపూర్వకంగా సీఎం వైయస్‌ జగన్‌ ద్వారా చూస్తున్నాం. మంచి కొడుకుగానే కాకుండా.. మంచి వారసుడిగా వైయస్‌ జగన్‌ నిలిచారు. వైయస్‌ఆర్‌ ఆలోచనలు, సిద్ధాంతాలకు, ప్రేమకు, దార్శనికతకు సీఎం వైయస్‌ జగన్‌ వారసుడిగా నిలిచారు. ఇలాంటి ఘనమైన నాయకుడి వెనుక అడుగులు వేస్తున్నాం.. ఇందుకు మనందరం కాలర్‌ ఎగరేసుకొని వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. 

రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా, సుఖశాంతులతో ఉంటుందో ఆ నాయకుడి చేతుల్లోనే ఉంది. ఆయనే సీఎం వైయస్‌ జగన్‌. ఈతరం యువత వైయస్‌ఆర్‌ ఎవరంటే సీఎం వైయస్‌ జగన్‌ తండ్రి అని చెప్పుకునేలా పాలన సాగిస్తున్నారు. అంతకంటే ఏ తండ్రికి తృప్తి, ఆత్మశాంతి ఉండదు. 

సీఎం వైయస్‌ జగన్‌ వేస్తున్న అడుగులు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేలా ఉన్నాయి. మంచి పాలన, ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. మరో ఐదేళ్లలో రాష్ట్రం నంబర్‌ వన్‌గా నిలబడే గట్టి పునాదులు ఇప్పటికే పడ్డాయి. అన్ని వ్యవస్థలను సీఎం వైయస్‌ జగన్‌ రిపేర్‌ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలను సీఎం వైయస్‌ జగన్‌ వందకు 200 శాతం, నిబద్ధతతో, దార్శనికతతో అమల్లోకి తీసుకువచ్చి రిజల్ట్‌ చూపిస్తున్నారు. ఏ సర్వే చేసినా 70 నుంచి 80 శాతం మంది మాకు జగనన్నే కావాలి.. ఆయనే ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పరిపాలించాలి, మా బతుకులు ఆయన చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటాయని అంటున్నారు. అధికారాన్ని బాధ్యతగా చేస్తున్నారు కాబట్టే తక్కువ సమయంలోనే అనేక ఫలితాలు తీసుకొచ్చారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అప్పగించిన అధికారమనే బాధ్యతను శాశ్వతం చేసేలా, సీఎం వైయస్‌ జగన్‌ను పర్మనెంట్‌గా రాష్ట్రానికి దిక్సూచిలా ఉంచేలా పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకమై వారి అవసరాలు తీర్చడంతో పాటు ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన 1.40 కోట్ల మందిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలబెట్టేలా ముందుకుసాగాలి’’ అని సజ్జల అన్నారు. 

Back to Top