కాసేపట్లో ‘వైయస్‌ఆర్‌ జగనన్న భూహక్కు–భూరక్ష’ ప్రారంభం

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైయస్‌ఆర్‌ జగనన్న భూహక్కు–భూరక్ష’ పథకం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడులో సీఎం ప్రారంభించనున్నారు. తక్కెళ్లపాడులో సమగ్ర భూ రీసర్వే ప్రాజెక్ట్‌కు సీఎం వైయస్‌ జగన్‌ పునాది రాయి వేయనున్నారు. రీసర్వే ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేట ఎస్‌జీఎస్‌ కాలేజీలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడతారు. సభా ప్రాంగణం వద్ద రీసర్వే ఆర్మీఫోర్స్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రీసర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ను ప్రారంభిస్తారు. 

బ్రిటీష్‌ కాలం సర్వేతో భూ వివాదాలను చెరిపేందుకు వైయస్‌ జగన్‌ సర్కార్‌ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూసర్వే జరగనుంది. అటవీ ప్రాంతాలు మినహా గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఆవాసాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రైతులపై భారం పడకుండా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం రూ.967 కోట్లు వెచ్చిస్తోంది. వందేళ్లుగా ఉన్న సరిహద్దు వివాదాలు భూముల సమగ్ర రీసర్వే ద్వారా తొలగిపోతాయని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 

Back to Top