కుప్పంలో వైయ‌స్ఆర్ విగ్రహం ధ్వంసం

 చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైయ‌స్సార్‌ విగ్రహ ధ్వంసంపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
 

Back to Top