ప్ర‌జ‌ల ప్రాణాలంటే టీడీపీకి లెక్కలేదు 

మహానాడు నిర్వహణకు కరోనా ఉందనేది టీడీపీ నేత‌లకు గుర్తులేదా..?

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పీ.రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా ఫైర్‌

క‌డ‌ప‌:  తెలుగు దేశం పార్టీకి ప్ర‌జ‌ల‌న్నా..వారి ప్రాణాల‌న్నా లెక్క లేద‌ని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పీ.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిప‌డ్డారు. శ‌నివారం వారు క‌డ‌ప‌లో మీడియాతో మాట్లాడుతూ..`మహానాడు నిర్వహణకు కరోనా ఉందనేది టీడీపీ వారికి గుర్తులేదా..?. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి...కొత్త వేరియంట్ అంటున్నారు..మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహానాడును వాయిదా వేసుకోవడం మంచిది. లేదంటే ఇక్కడే పెద్ద ఎత్తున విజృంభించే పరిస్థితి ఉంది. అధికారులు కూడా కరోనా గైడ్ లైన్స్  ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం నలుగురు వ్యక్తులు గుమికూడ కూడదని ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. నిన్న కడపలో ఒక కేసు నమోదు అయ్యింది...దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. రిమ్స్ ఆసుప‌త్రి సూపరింటెండెంట్ కరోనా ఉందని చెప్పిన గంటలోనే కరోనా లేదని మభ్యపెట్టే చర్యలకు దిగారు. అంతలా మభ్యపెట్టాల్సిన అవసరం ఏముంది...? . టిడిపి వారికి ప్రజలన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేదు. గోదావరి పుష్కరాలు, కందుకూరు మీటింగ్‌లో చంద్ర‌బాబు ప్ర‌చార పిచ్చికి ఎంతో మంది చనిపోయారు. బాధ్యత కలిగిన వారైతే ఈ కరోనా పరిస్థితుల్లో టీడీపీ మ‌హానాడు వాయిదా వేసుకుని ఉండే వారు. అక్కడంతా అధికారులే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు పేరు చెప్పి టెండర్ల పూర్తి కాకుండానే పనులు పూర్తయ్యాయి. కార్పొరేషన్, పంచాయతీ నిధులను కూడా మహానాడుకు వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంలా ఉంది తప్ప పార్టీ కార్యక్రమం కాదు. కలెక్టర్ నుంచి అందరు అధికారులు అక్క‌డే పని చేస్తున్నారు. డయాస్ నుంచి గ్యాలరీలో నీళ్లు ఇచ్చే వరకు అధికారులే ఉంటున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇంతలా ప్రభుత్వాన్ని వాడుకోవడం మునుపెన్నడూ చూడలేదు. కూట‌మి ప్ర‌భుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ...తమ మహానాడుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొత్త‌గా ఒక్క సంక్షేమ పథకం, ఒక్క ప్రాజెక్టు రాష్ట్రానికి తీసుకురాలేదు. బనకచర్ల పేరు చెప్పి రాయలసీమ వాసులను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. కేవలం మొబలైజేషన్ అడ్వాన్స్ కోసమే ఇలాంటి ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు. మీరు ఏమి చేశారని రాయలసీమలో  మహానాడు నిర్వహిస్తున్నారు...? మద్యం, డబ్బు ఇచ్చి మహానాడుకు జనాన్ని తెచ్చి కరోనా అంటించి పంపిస్తారా? అందుకే ఈ మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలి..ప్రజల ప్రాణాలు కాపాడండి` అంటూ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా టీడీపీ నేత‌ల‌కు సూచించారు.

Back to Top