గుడివాడ: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని, తనను ఓడిస్తే రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతానని, లేకపోతే బాబు టీడీపీ జెండాను పీకేసుకుంటాడా..? అని మాజీ మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కొడాలి నాని సవాల్ విసిరారు. గుడివాడ ప్రజల ఆశీస్సులతో 2004లో, 2009లో, 2014లో, 2019లో ఎమ్మెల్యేగా గెలిచా.. 2024లో గెలుస్తా.. 2029లో గెలుస్తా.. గుడివాడలోనే పుట్టా.. గుడివాడ మట్టిలో కలిసిపోతానని కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజకవర్గ వైయస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఏం మాట్లాడారంటే.. కుప్పంలో సర్పంచ్‌లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను, మున్సిపాలిటీని గెలిపించుకునే చవట దద్దమ్మ చంద్రబాబు. సీఎం వైయస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. కొడాలి నానిని గుడివాడలో ఓడిస్తా.. జోగి రమేష్‌ను పెడనలో ఓడిస్తా.. పేర్ని నానిని బందరులో ఓడిస్తా. వంశీని గన్నవరంలో ఓడిస్తా.. అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ.. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు. నువ్వు కుప్పంలో గెలువు ముందు.. సీఎం వైయస్ జగన్ 2019లో నిన్ను నమ్ముకున్న దత్తపుత్రుడిని రెండు చోట్ల తుక్కుగా ఓడించాడు. నీ కొడుకును మంగళగిరిలో చిత్తుగా ఓడించాడు. 2024 ఎన్నికల్లో నిన్ను కుప్పంలో ఓడించి.. ఈ రాష్ట్ర ప్రజల రుణం, ఎన్టీఆర్ రుణం తీర్చుకునే వ్యక్తి సీఎం వైయస్ జగన్. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడకు రా పోటీ చేద్దాం.. నన్ను ఓడిస్తే రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతా.. లేకపోతే నువ్వు పార్టీ పీక్కొని పోతావా.. 2004లో, 2009లో, 2014లో, 2019లో గెలిచా.. 2024లో గెలుస్తా.. 2029లో గెలుస్తా.. ఇక్కడే పుట్టా.. ఇక్కడే మట్టిలో కలిసిపోతా.. చంద్రబాబు పుట్టిన ఊరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉందది. చంద్రగిరిలో పెరిగి.. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేశాడు.. మంత్రి అయ్యాడు. 1983లో ఎన్టీఆర్ దెబ్బకు.. చంద్రబాబు ఫుట్‌బాల్‌లా గాల్లో ఎగిరాడు. మా కోసం పార్టీ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు. సీఎం వైయస్ జగన్‌కు ఏ మీడియా సపోర్టు లేకపోయినా రాష్ట్ర ప్రజల సపోర్టు ఉంది. వైయస్‌ఆర్ సీపీ కుటుంబ సభ్యుల మద్దుతు ఉంది. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు, పవన్ కల్యాణ్ ఇలాంటి దొంగలు, 420ల నుంచి సీఎం వైయస్ జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రతీ ఒక్కరిపై ఉంది. సీఎం వైయస్ జగన్‌కు మేమంతా అండగా ఉంటాం. చనిపోయేవరకు జగన్ అడుగులు వదలం. మా చావు, బతుకు వైయస్ జగన్‌తోనే.. ఆయనకోసం మా జీవితాన్ని ధారపోస్తాం’’ అని కొడాలి నాని అన్నారు.