తలశిల రఘురాం తండ్రి మృతిపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి 

తాడేపల్లి: ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ తండ్రి తలశిల చంద్రశేఖరరావు మృతి పట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ విజయవాడ గొల్లపూడిలోని తలశిల రఘురామ్‌ నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Back to Top