ఊరూరా మ‌హానేత వైయ‌స్ఆర్ జ‌యంతి వేడుక‌లు

రాష్ట్రవ్యాప్తంగా ఘ‌నంగా జయంతి కార్య‌క్ర‌మాలు

అమ‌రావ‌తి:  దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు ఊరూరా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. వాడ వాడ‌ల్లో మ‌హానేత విగ్ర‌హాల‌కు అభిమానులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పిస్తున్నారు. విశాఖ‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో  రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ వైయ‌స్‌ఆర్‌ చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేదవాడి గుండె చప్పుడు బాగా తెలిసిన వ్యక్తి. తెలుగువారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో రాజశేఖరరెడ్డి నిలిచిపోతారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్. తండ్రి బాటలోనే సీఎం వైఎస్‌ జగన్ పయనిస్తున్నారు. సంక్షేమం కోసం రాజశేఖరరెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే సీఎం వైయ‌స్ జగన్‌ వంద అడుగులు ముందుకు వేస్తున్నార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి, పార్టీ కన్వీనర్ కేకే రాజు, మళ్ళ విజయ ప్రసాద్, అక్రమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల, చింతలపూడి, తైనాల విజయ్ కుమార్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్ జిల్లా..
వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష వైయ‌స్ఆర్ విగ్ర‌హానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, మేయర్ సురేష్ బాబు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, ఏపీ ఏనార్టీ డైరెక్టర్ ఇలియస్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిష్ణారెడ్డి కమలాపురం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహమండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్ రెడ్డి,  డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రాజుపాలెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ ఉత్తమారెడ్డి పాల్గొన్నారు.

 రాజంపేట మండలంలో వైయ‌స్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. అంతకముందు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, అకేపాటి అమరనాథ్ రెడ్డి రాజంపేట పాత బస్టాండు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 

గుంటూరు: 
నగరంపాలెంలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.

కృష్ణా:
 దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా.. ఉంగుటూరు మండలం తేలప్రోలులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వింత శంకర్ రెడ్డి, వాసు రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, తోట వెంకయ్య పాల్గొన్నారు.

 
కర్నూలు: 
జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. న‌ల్ల‌కాల్వ‌లోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హానేత విగ్ర‌హానికి నాయ‌కులు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. క‌ర్నూలు న‌గ‌రంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, కర్నూలు మేయర్ బి.వై. రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుకా తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి: 
మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా దేవరపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో వృద్ధులకు వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

 

 

Back to Top