మా కుటుంబంపై  అసత్య ప్రచారాలు మానుకోవాలి

నాన్న మరణించిన బాధలో ఉంటే..దుష్ఫ్రచారమా..

నాన్న హత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరపాలి

వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత

వైయస్‌ఆర్‌ జిల్లా: మా నాన్న మరణించి మేం బాధలో ఉంటే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని వైయస్‌ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.  మా నాన్న వైయస్‌ వివేకానందరెడ్డికి  ప్రజల తర్వాతే కుటుంబం.. ఆయన నిత్యం ప్రజల మధ్యనే ఉండేవారన్నారు. మా నాన్నను అందరూ అభిమానిస్తారన్నారు. ఐదు రోజుల క్రితం  నాన్న హత్యకు గురవడం బాధాకరమన్నారు. సంఘటన తర్వాత మీడియాలో చేస్తున్న దుష్ఫ్రచారం చూస్తే ఇంకా బాధేస్తుందన్నారు.ఆయన గొప్ప మనిషి అని, చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడి ఆయనను అవమానిస్తున్నారన్నారు. నాన్నను కిరాతకంగా హత్యచేసిన గుర్తించి దోషులెవరో విచారించి తేల్చాలన్నారు. టీడీపీ ప్రభుత్వం హత్య కేసును పక్కదారి పట్టిస్తుందని, విచారణ దశలో చంద్రబాబు వ్యాఖ్యలు పద్దతిగా లేవన్నారు.దర్యాప్తు సమయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడం దారుణమన్నారు. మా జగనన్నను సీఎం చేసుకునేందుకు అందరం కష్టపడుతున్నామని.. జగనన్నను సీఎం చేయాలనేది మా నాన్న కోరికని తెలిపారు. మా కుటుంబంపై దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. మా కుటుంబంలో గొడవలని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏడు వందలకు పైగా ఉన్న మా కుటుంబంపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. నాన్న హత్యపై విచారణ నిష్పక్షపాతంగా జరిపించాలన్నారు.
 

Back to Top