చంద్రబాబుకు మళ్లీ ఓటేసి మోసపోవద్దు..

40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు ఏంచేశారు..

చంద్రబాబు అబద్ధాలు ప్రజలు నమ్మరు

మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు..

చంద్రబాబుకు విలువలు,విశ్వసనీయత లేవు..

పత్తికొండ ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

కర్నూలు జిల్లా: ఓటేసేందుకు రెండురోజులే ఉంది...అందరూ జాగ్రత్త పడండి..40 ఏళ్ల అనుభవమంటూ చంద్రబాబు మోసం చేశాడు..మళ్లీ టీడీపీకి ఓటువేసి మోసపోద్దని వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ అన్నారు.ఆమె పత్తికొండ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

అన్నదమ్ములు,అక్కచెల్లెమ్మలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు.వైయస్‌ఆర్‌ను ప్రేమించిన ప్రతి హృదయానికి,వైయస్‌ జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి గుండెకు హృదయపూర్వక కృతజ్ఞతలు.మీ అభిమానానికి హద్దులేవు.ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి,అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టమని అడుగుతున్నా..గత ఎన్నికల్లో మనం మోసపోయాం..చంద్రబాబుకు ఓటువేసి మళ్లీ  మోసపోవద్దు అని కోరుతున్నా.వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతును రాజును చేయాలని, వ్యవసాయాన్ని పండగచేయాలని ప్రాజెక్టులను మొదలుపెట్టడం జరిగింది. గాలేరునగరి,హాంద్రీనీవా,వెలుగొండ వంటి ప్రాజెక్టులు ఆయన హయాంలో ప్రారంభం అయ్యాయి.ఒక వైపు అభివృద్ధి,మరో వైపు సంక్షేమం జరిగింది. అన్నివర్గాలు  సంతోషంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కోరుకున్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో 71 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చారు. దేశమంతాట 48 లక్షలు ఇళ్లు నిర్మిస్తే..మన రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టించారు.కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చారు.

తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను 110 రూపాయలకే ఇచ్చారు.పేదవారు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్తులు అమ్ముకోకుండా ఇబ్బందులు పడకూడదని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టక ముందు వైయస్‌ఆర్‌ సీఎం ఫండ్‌ దాదాపు 500 కోట్లు ఇచ్చారు.కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ జీవం పోసింది. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన 108,104లు ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడారు.పేదలు చదువుకోవడానికి ఇబ్బందులు పడకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు.దళితులకు 32 లక్షల ఎకరాలు ఇచ్చారు.ఏ ప్రభుత్వం కూడా ఇంతవరుకూ ఇవ్వలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. అన్నిరకాల సంక్షేమం పథకాలు అమలుచేశారు. వైయస్‌ఆర్‌ ప్రభుత్వం కుల,మతా,పార్టీలకు అతీతంగా సంక్షేమపథకాలు అందించారు. నేడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు సిఫార్సులతోనే ఇస్తున్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఛార్జీలు,పన్నులు పైసా కూడా పెంచకుండా సంక్షేమపథకాలు అమలుచేశారు. ప్రపంచంలోనే రికార్డు.అందరూ సంతోషంగా ఉండాలని వైయస్‌ఆర్‌ కోరుకున్నారు.అభివృద్ధి చేసి వైయస్‌ఆర్‌ ప్రజలను ఓటు అడిగారు.2009లో వైయస్‌ఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు.చివరి క్షణం దాకా వైయస్‌ఆర్‌ ప్రజల గురించే ఆలోచించారు. రచ్చబండకు వెళ్తూ వైయస్‌ఆర్‌ ప్రాణాలు కోల్పోయారు. వైయస్‌ఆర్‌ మరణం తట్టుకోలేక ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి.ఒక మనిషి గుండె ఆగిపోవాలంటే ఎంత ప్రేమ ఉండాలి.వారిని ఓదార్చేందుకు వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.వైయస్‌ జగన్‌కు ఎవరూ సాయం చేయకూడదని ఆదేశాలిచ్చారు.ప్రజలకు ఇచ్చిన మాట కోసం వైయస్‌ జగన్‌ కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చారు.చంద్రబాబు,కాంగ్రెస్‌ కలిసి వైయస్‌ జగన్‌పై కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టారు.జైలుకు పంపించారు..వైయస్‌ఆర్‌ బతికుండగా నేను ఎన్నడూ బయటకు రాలేదు.

వైయస్‌ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని గెలిపించుకోవడానికి బయటకురావాల్సి వచ్చింది.అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు.సిబిఐ,ఈడి దాడులు చేశారు. ఆస్తులను అటాచ్‌చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి రోడ్డుకిడ్చారు. వైయస్‌ఆర్‌ వల్ల పైకి వచ్చిన వారు కష్టకాలంలో మా వెంటలేరు. అలాంటి సమయంలో మా కుటుంబానికి,వైయస్‌ జగన్‌కు తోడు ప్రజలు ఉన్నారు.ప్రజల కోసం వైయస్‌ జగన్‌ అనేక పోరాటాలు చేశారు.కడుపుమాడ్చుకుని గల్లి నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశారు.తొమ్మిది సంవత్సరాల్లో ప్రత్యేకహోదా నిలబడిదంటే వైయస్‌ జగనే కారణం.14 సార్లు బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేస్తున్నా.. తొమ్మిది సంవత్సరాలు మీతోనే ఉన్నాడు.వైయస్‌ఆర్‌ను లేని లోటును వైయస్‌ జగన్‌ తీరుస్తాడు.మీకు అండగా ఉంటారు.పాదయాత్రలో వైయస్‌ జగన్‌ ప్రజల బాధలు విన్నారు.చూశారు. ఒకసారి  వైయస్‌ఆర్‌ పాలనును గుర్తుచేసుకోండి..చంద్రబాబు ప్రభుత్వంలో ఏంజరుగుతుందో ఒకసారి పరిశీలించండి.చంద్రబాబు 650 పై చిలుకు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడు.మేనిఫెస్టో అంటే ప్రజలకు ప్రమాణం చేయడం..ఒకటి కూడా  చంద్రబాబు నేరవేర్చాడా.. అని అడుగుతున్నా..వెబ్‌సైట్‌లో సైతం తొలగించి..మళ్లీ కొత్త బుక్‌ విడుదల చేస్తారు. వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ చేశారు.మనసా..వాచా..కర్మేనా..మేనిఫెస్టోను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని వైయస్‌ జగన్‌ చెప్పారు.వైయస్‌ జగన్‌ రైతులకు భరోసాగా పెట్టుబడి సాయం కోసం 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తే..చంద్రబాబు నేడు అన్నదాత సుఖీభవ అంటూ ప్రజల ముందుకు వచ్చాడు..చంద్రబాబుకు రైతులు ఎన్నికల ముందే గుర్తుకు వచ్చాడా..గ్రామాల్లో బెల్ట్‌షాపులు రద్దున్నారు..ఏమైంది..ఎక్కడ చూసిన మద్యం ఏరులై పారుతోంది. ఉద్యోగస్తులు భయపడాల్సిన పనిలేదు.పాత పెన్షన్‌ విధానమే కొనసాగిస్తాం. సీపీఎస్‌ను రద్దుచేస్తాం.కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాం.సమాన పనికి సమాన వేతనం ఇస్తాం.అంగన్‌వాడీలు జీతాలు పెంచమంటే చంద్రబాబు వారిని గు్రరాలతో తొక్కించారు.ఆశవర్కర్లు జీతాలు పెంచామంటే లాఠీలతో కొట్టించారు.మధ్యాహ్న భోజనం కార్మికులను జైల్లో పెట్టించారు.

వైయస్‌ఆర్‌ జీవిత బీమా ద్వారా 18 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తూ మరణించిన లక్ష రూపాయలు ఇస్తాం.భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా  కౌలు రైతులకు పంటపై హక్కుపై కల్పించే విధంగా ప్రతి పథకం అందిస్తాం.రైతులు ప్రమాదశాత్తూ చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తాం.ఉచితంగా తొమ్మిది గంటలు విద్యుత్‌ ఇస్తాం.ట్రాక్టర్‌ రోడ్డు ట్యాక్స్‌ రద్దుచేస్తాం.పంటలకు గిటుబాటు ధర కల్పించడానికి 3వేల కోట్లతో స్థీర నిధికరణ నిధి ఏర్పాటు చేస్తాం.ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం. పిల్లలి బడికి పంపితే చాలు అమ్మ ఒడి ద్వారా మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తాం. మీ పిల్లలను వైయస్‌ జగన్‌ ఉన్నత చదువులు చదివిస్తారు. నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం.వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తాం. 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం పత్తికొండ నియోజకవర్గం బాగా వెనుకబడిన ప్రాంతం..వైయస్‌ఆర్‌ హయాంలోనే పత్తికొండకు మేలు జరిగింది.వజ్రాలకు ప్రసిద్ధి..వర్షాలు పడితే వజ్రాలు వస్తాయి. చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు..వజ్రాలు లేవు.కనీసం వజ్రాలు లేకపోయినా తాగునీరు ఉందా అంటే అది లేదు..యూనిసెఫ్‌ నివేదిక ప్రకారం తాగునీటì  వసతిలో 144వ స్థానంలో ఉంది.చాలా ఏళ్లుగా టీడీపీని గెలుపిస్తున్నారు.ఈ సారి అమ్మకు మాట ఇస్తారా..వైయస్‌ఆర్‌సీపీ ఓటేస్తారా..హాంద్రీనీవా కోసం 190 కోట్లు మంజూరు చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం పూర్తియ్యాయి.

చంద్రబాబు హయాంలో మిగిలిన 20 శాతం పూర్తిఅవ్వలేదు.ఒక పెద్దాయన చెప్పారు.2004లో కర్నూలు జిల్లా మొత్తం కాంగ్రెస్‌ గెలిస్తే..పత్తికొండ మాత్రం టీడీపీ గెలిచింది.అప్పుడు కర్నూలు జిల్లాలో వర్షాలు పడినప్పుడు పత్తికొండలో వర్షాలు పడలేదంట..కాబట్టి టీడీపీకి ఓటేస్తే అభివృద్ధిరాదు. వర్షాలు రావు..టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. బీసీలను చంద్రబాబు హీనంగా చూస్తారు.బీసీలు,ఎస్సీలు న్యాయమూర్తులుగా ఉండటానికి వీలులేదని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన ప్రభృతుడు చంద్రబాబు.పత్తికొండలో రెండు బీసీ,నాలుగు ఎస్సీ హాస్టళ్లను మూసివేశారు.కర్నూలు జిల్లాలో ఇద్దరు ఎంపీలు,5 ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించి ఏమి అభివృద్ధి చేశారు అని అడుగుతున్నా..చంద్రబాబుకు దమ్ము ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత  రాజీనామాలు చేయించి మళ్లీ గెలుపించుకోవాలి.అసెంబ్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలుగానే ఉండటం సిగ్గుచేటు.ఇదేనా చంద్రబాబు విలువలు. ఎంపీలను,ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు బుద్ధిచెప్పాలి.

వైయస్‌ జగన్‌కు ఓటేస్తే మరణశాసనమంటూ చంద్రబాబు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాడు.కేసులు ఉన్నాయని చెబుతున్నాడు.ఆ కేసులన్ని మీరు పెట్టిన కేసులు కాదా చంద్రబాబూ అని అడుగుతున్నా..17 కేసుల్లో స్టేలు తెచ్చుకుని బతుకుంది మీరు కాదా..నా కుమారుడు వైయస్‌ జగన్‌ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తాడు. పచ్చి అబద్ధాలు చెబుతాడు.చంద్రబాబు మహిళల మాన ప్రాణాలతో నీచ రాజకీయాలు చేస్తున్నాడు.భన్వర్‌లాల్‌కు రోజాకు సంబంధం  ఉందని విష ప్రచారం చేయడం దుర్మార్గం. లక్ష్మిపార్వతిపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలా..ప్రత్యేకహోదా సాధించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.ఎన్నో రాయితీలు వస్తాయి. ఉద్యోగాలు పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేకహోదాపై వైయస్‌ జగన్‌ నిరంతరం పోరాడుతున్నారు.మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా ప్రత్యేకహోదా సాధించగలం.ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుతెచ్చుకోవాలి.వైయస్‌ జగన్‌ సీఎం అయితే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తాడు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రావాలి. సంక్షేమపథకాలను ప్రతి ఇంటికి చేరుస్తాడు.ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.. 

Back to Top