చంద్రబాబు పాలనంతా అవినీతిమయం

మాటమీద నిలబడే వ్యక్తి వైయస్‌ జగన్‌

ప్రజలకు వైయస్‌ కుటుంబం రుణపడి ఉంది

విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి..

శ్రీకాకుళం జిల్లా అంటే వైయస్‌ఆర్‌కు అభిమానం

చల్లవానిపేట ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ..

శ్రీకాకుళం జిల్లా:చంద్రబాబు పాలనలో ఒక సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదని వైయస్‌ విజయమ్మ అన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దేనిని వదల లేదన్నారు.ఇష్టారాజ్యంగా అవినీతి,అక్రమాలు జరిగాయన్నారు.ఆమె శ్రీకాకుళం జిల్లా చల్లవాని పేటలో ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. 

ప్రసంగం ఆమె మాటల్లోనే..

ధర్మానికి,అ«ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది.న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టండి. వైయస్‌ఆర్‌ అమలు చేసిన ప్రతి పథకాలను గుర్తుచేసుకోవాలి.రాజశేఖర్‌రెడ్డిని 30 సంవత్సరాలుగా భుజస్కందాలపై మోసి సీఎం చేసుకున్నారు.వైయస్‌ఆర్‌ సీఎంగా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది.వైయస్‌ఆర్‌ లేని లోటు మా కుటుంబానికి కంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది.కేవలం వైయస్‌ఆర్‌ ఆశయాల కోసమే వైయస్‌ఆర్‌సీపీ పుట్టింది. తొమ్మిది సంవత్సరాల్లో వైయస్‌ జగన్‌ను అనేక ఇబ్బందులకు గురిచేశారు.ప్రజలకిచ్చిన మాట కోసం జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.జగన్‌ ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు.యాత్ర చేయవద్దని చెప్పారు.వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట కోసం ఓదారు యాత్ర చేశారు.గ్రామాలగ్రామాలు జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. ప్రజలకు వైయస్‌ కుటుంబం రుణపడి ఉంది.వైయస్‌ఆర్‌ను ఏవిధంగా నాయకుడి చేసుకున్నారో జగన్‌ను కూడా నాయకుడిని చేసుకున్నారు.జగన్‌పై అనేక కుట్రలకు పాల్పడ్డారు.ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేశారు.జైల్లో పెట్టారు. అన్ని రకాలుగా బాధపెట్టారు. ఏ రోజు కూడా ప్రజల ముందు కష్టాల్ని వ్యక్తం చేయలేదు.పదహారు నెలలు తప్పితే తొమ్మిది సంవత్సరాలు కూడా ప్రజలతోనే జగన్‌ ఉన్నాడు.మీకొచ్చిన ప్రతి ఇబ్బందుల్లోనూ ఉన్నాడు. రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారు.కడుపుమాడ్చుకుని దీక్షలు చేశారు.ఎలక్షన్‌ రానే వచ్చాయి. జాగ్రత్తగా గమనించి విజ్ఞతగా ఓటు వేయాలని కోరుతున్నా. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి.వైయస్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నో రకాల నిందలు మౌనంగా భరిస్తున్నాం.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి బతికున్నప్పుడు ఏ రోజు నేను బయటకు రాలేదు.వైయస్‌ఆర్‌ మరణం అనంతరం..జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.మరిది వైయస్‌ వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్యచేశారు. అయినా కూడా మీ మీద అభిమానంతో బయటకు రావాల్సివచ్చింది.ౖ వెయస్‌ఆర్‌ భార్యగా, జగన్‌బాబు తల్లిగా నేడు మీ ముందుకు వచ్చి నిలబడ్డాను.వైయస్‌ఆర్‌ చెప్పింది..చెప్పలేనిది చేసి చూపించి ఓటు అడిగారు..నేడు చంద్రబాబు ఏం చేశారని ప్రజలను ఓటు అడుగుతున్నారు.చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు.వైయస్‌ఆర్‌ శాచురేషన్‌ విధానంలో కుల,మత,పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు.జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు మొదలుపెట్టారు.ఆర్టీసీ ఛార్జీలు,రోడ్డు ట్యాక్స్‌లు వంటి ఏవీ కూడా వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి పెంచలేదు. పైసా కూడా పెరగలేదన్నారు. అది ప్రపంచ రికార్డు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీఛార్జీలు,కరెంటు బిల్లులు,ఇంటిపన్నులు ఎన్ని సార్లు పెంచారు..ప్రజలు ఒకసారి ఆలోచించాలి.చంద్రబాబు ఎలక్షన్‌ ముందు 650 వాగ్ధానాలు ఇచ్చారు.ఐదు మాఫీలు చేస్తానని చెప్పారు..రైతులు రుణమాఫీ జరిగిందా.ఐదుమాఫీలు చేస్తానని చెప్పారు.చేశారా..వైయస్‌ఆర్‌ హయాంలో రైతుల రుణమాఫీ,ఉచిత విద్యుత్,కరెంటు బకాయిల మాఫీ,గిట్టుబాటు ధరలు,రైతులకు బీమా వంటి అన్నిరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.చంద్రబాబు హయాంలో రైతులకు బీమా కూడా ఇవ్వలేదు.కనీసం మద్దతు ధరలు కూడా ఇవ్వలేదు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు 14వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు.నేడు ఆ రుణం 25 వేల కోట్ల రూపాయలు అయ్యింది.పసుపు–కుంకుమ ఇస్తున్నారా.. చెక్కులు ఇచ్చారా..రెండు సంవత్సరాల నుంచి వైయస్‌ జగన్‌ నవరత్నాల గురించి చెబుతున్నారు.ఎలక్షన్‌ ముందు చంద్రబాబు అన్నదాత సుఖీభవ అని ప్రకటించాడు.90 లక్షల మందికి పెద్దన్నను అని చెప్పుకుంటున్నాడు.అన్న అనేవాడు ఎలక్షన్‌ సమయంలోనే కాదు ఎల్లప్పుడు  అన్నగానే ఉండాలి. వైయస్‌ఆర్‌ మహిళలకు పావలావడ్డీ రుణాలు ఇచ్చారు.రెండు రూపాయలకే 20 లీటర్ల నీరు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.ఇస్తున్నారా..బార్‌ షాపులను రద్దుచేస్తానని చెప్పారు.రద్దు చేశారా.. నీళ్లు దొరకడంలేదు కాని, మద్యం మాత్రమే  దొరుకుతుంది.బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు.ఉద్యోగాలు ఇచ్చారా.. రాష్ట్రంలో సుమారు 2 లక్షలకుపైగా ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి.ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇచ్చారా..వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చారు.ఇవాళ చంద్రబాబు చెబుతున్నాడు.. ఎన్టీఆర్‌ సేవలో ఐదు లక్షలు ఇస్తారంట..ఇస్తాడనే నమ్మకం ఉందా...మైనార్టీలకు దేశంలో ఎక్కడ లేని విధంగా 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఈ పథకం సక్రమంగా జరగడంలేదు.అన్యాయం,అక్రమం,మోసాలు జరుగుతుంది.ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి నుంచి బొగ్గు దాకా, బొగ్గు నుంచి రాజధాని భూముల దాకా..దళిత,ఆలయ భూములు కూడా వదలడం లేదు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి జగన్‌ ప్రకటించిన నవరత్నాలు అన్ని అందుతున్నాయి.వైయస్‌ జగన్‌ మాట ఇస్తే తప్పడు..శ్రీకాకుళం అంటే రాజశేఖర్‌రెడ్డికి చాలా అభిమానం.వైయస్‌ఆర్,జగన్,షర్మిల పాదయాత్ర చేసి ముగించిన జిల్లా ఇదే..

Back to Top