తాడేపల్లి: జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మనిచ్చి ధన్య మాత వైయస్ విజయమ్మ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా..అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.