టీడీపీ నేతలను నిలదీయండి

విశాఖ సభలో వైయస్‌ షర్మిల

అరాచకాలకు మారుపేరు చంద్రబాబు

చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు..

తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని లూటిచేశారు

చంద్రబాబు,పవన్‌లు ఒక్కటే..

ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా..

విశాఖ జిల్లా:  టీడీపీ వాళ్లు ఓట్ల కోసం వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని అడగండి. మీకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి సంబంధించి.. రావాల్సిన బాకీని చెల్లించమని నిలదీయాలని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో దోచుకున్న మీ భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఇలా అయితే ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీ బాకీ తీర్చలేర’ని చెప్పారు. విశాఖలోని కంచరపాలెంలో నిర్వహించిన ఎన్నికల సభలో షర్మిల మాట్లాడారు.

ఒక రూపాయి పన్ను,చార్జీలు  పెంచకుండా సంక్షేమ పాలన అందించిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌. కుల,మత,పార్టీలకు అతీతంగా మేలు చేసిన నేత వైయస్‌ఆర్‌.  ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకానికి,అవినీతికి,వెన్నుపోటుకు మారుపేరుగా నిలిచారు.ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఒకటంటే ఒకటి సాధించాడని  చెప్పుకోవడానికి చంద్రబాబుకు లేదు. విశాఖపట్నం నగరానికి మెట్రోరైలు తెస్తానన్నాడు.మెగా ఐటి పార్కు తెస్తాన్ననాడు.బోటినికల్‌ గార్డెన్‌ అంట.. సైన్‌ సిటీ,పుడ్‌ ఫార్కు అంటా.. ఎన్ని కథలు చెప్పలేదు. ఎన్ని పువ్వులు పెట్టలేదు.భీమిలి నుంచి కాకినాడ వరుకు తీరప్రాంత రహదారి వేస్తానన్నాడు.20 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తానన్నాడు.. 40 లక్షల ఉద్యోగాలు తెస్తానన్నాడు.ఐటి శాఖ రివర్స్‌గేర్‌లో వెనుక్కుపోయింది. కొత్త పరిశ్రమలు రాMýంండా ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నారు. ఉద్యోగాలు పోతున్నాయి.

చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లన ఉక్కుఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోంది.ఒకప్పుడు 24 వేల పర్మినెంట్‌ ఉద్యోగుస్తులు ఉన్నారు.ఐదేళ్లలో  4వేల మందికి అయ్యారు.చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుంది. ఎక్కడా చూసిన అరాచకమే..మహిళల పట్ల ఎంత గౌరవంలేదు.విశాఖలో మహిళలు రాత్రులు తిరగడానికి లేదు,. ఎక్కడా మద్యం ఏరులై పారుతుంది,పెందుర్తి ఒక దళిత మహిళను వివస్త్రను చేసి రోడ్డు మీద కొడితే చంద్రబాబు ప్రభుత్వం ఒకరినైనా శిక్షించిందా..ఇదే విశాఖపట్నంలో నడ్డిమీద రోడ్డు ఒక మహిళలను మానభంగం చేస్తే ప్రభుత్వం,చట్టం కళ్లుమూసుకున్నాయి.

ఇదే చంద్రబాబు మహిళలకు ఇచ్చే గౌరవం. రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు.ఒక రూపాయిలు కూడా  మాఫీ చేయలేదు. రైతులను దగాచేశారు. డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని  చంద్రబాబు వాగ్ధానం చేశాడు.రుణమాఫీ చేయలేదు. దానికి వడ్డి పడుతుంది.అది వడ్డీకైనా సరిపోతుందా.సరిపోవడంలేదు.మహిళలందరూ గమనించాలి. మహిళలను చంద్రబాబు మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎగిలిచేయి విదిలిస్తున్నాడు.మొత్తం రుణమాఫీ చేస్తానని చంద్రబాబు వాగ్ధానం. ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదు. మహిళలను దారుణంగా వంచించాడు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. తల్లిదండ్రులు అప్పులు పాలు అవుతున్నారని విద్యార్థులు చదువులు మానేస్తున్నారు.ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆసుప్రతుల లిస్ట్‌ను తొలగించారు.పేదవాడికి జబ్బులు వస్తే ప్రభుత్వాసుప్రతికే వెళ్ళలని చంద్రబాబు శాసించాడు.చంద్రబాబుకో,ఆయన కుటుంబసభ్యులకో జబ్బులొస్తే ఏ ఆసుప్రతికి వెళ్తారా..గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్తారా..కార్పొరేట్‌ ఆసుప్రతికి వెళ్తారా...చంద్రబాబు,ఆయన  కుటుంబం మాత్రం కార్పొరేట్‌ ఆసుప్రతికి వెళ్తారంట..సామాన్య ప్రజలు మాత్రం గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్లాలంట..ఇది అమానుషం కాదా.

కమీషన్లు కోసం పోలవరం ప్రాజెక్టును ఏకంగా 60 వేల కోట్లకు పెంచేశాడు.వాస్తవానికి కేంద్రం చేయించాల్సిన ప్రాజెక్టు..కాని కేంద్రం చేస్తే ఈయనకు కమీషన్లు రావుకాదా..మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు..మూడేళ్లు పూర్తయిన చేయలేదంటే చంద్రబాబు మాట మీద నిలబడే నైజం లేదుకాదా..చాలా అనుభవం ఉందని ప్రచారం చేసుకున్నాడుౖ.హైదరాబాద్‌ను నేనే కట్టినని గొప్పగా ప్రచారం చేసుకుంటాడు. రాజధానిని నేను అయితే కట్టగలనని ప్రచారం చేసుకుని  ముఖ్యమంత్రి అయ్యాడు..ఏం చేశాడు..ఒక శాశ్వత పర్మినెంట్‌ భవనం కట్టాడా..ఒక ఫైఓవర్‌ అయినా కట్టాడా..కేంద్ర ప్రభుత్వం చెబుతోంది..రాజధాని కోసం 2,500 కోట్లు  ఇచ్చారంట..ఒక పర్మినెంట్‌ భవనం కూడబా కనబడటం లేదు.ఆ డబ్బుంతా  ఏమైనట్లు.ఆ డబ్బుంతా చంద్రబాబు కడుపులో ఉంది..అమ్మకు అన్నం పెట్టడు గాని..పినమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడంట ఒకడు..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఒక పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదు కాని..మరో ఐదేళ్లు అధికారంలో ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట.శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తాడంట...మన చెవుల్లో పువ్వులు పెడతాడంట.మన చెవుల్లో క్యాబేజీలు కూడా పెడతాడంట. ఇది చేతగాని ముఖ్యమంత్రి అవసరమా.బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జాబు ఎవరికి వచ్చింది..చంద్రబాబు కొడుకుకి మాత్రమే వచ్చింది.

ఒకటి కాదు..రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రులను చేసి మన నెత్తిన కూర్చొపెట్టాడు.లోకేష్‌కు కనీసం జయంతి,వర్ధంతికి కూడా తేడా తెలియదు.అఆలు కూడా రావు కాని అగ్రతాంబూలం కూడా నాకే అన్నాడంట ఒకడు..లోకేష్‌ ఒకటి కూడా గెలవకుండానే ఒకటి రెండు కాదు..రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయ్యాడు.పుత్ర వాత్స్యలం కాదా..చంద్రబాబు కొడుకుకు మూడు ఉద్యోగాలంట.సామాన్య ప్రజలకు ఉద్యోగాలు లేవు. నోటిఫికేషన్లు కూడా లేవు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఊపిరి లాంటింది.ప్రత్యేకహోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు.పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు..అంత ముఖ్యమైన ప్రత్యేకహోదాను చంద్రబాబు బీజేపీతో నాలుగు సంవత్సరాలు సంసారం చేస్తూ కూడా సాధించలేక పోయారు.ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అవసరమా..గత ఎన్నికలకు ముందు.. పది ఏళ్లు కాదు..పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు.ఎన్నికలు అయిపోయాయి మాట మర్చాడు.ప్రత్యేకహోదా కాదు.. ప్యాకేజీ  తీసుకుంటే కమీషన్లు వస్తాయని ప్యాకేజీ కావాలన్నారు.ఇపుడు ఎన్నికలు వచ్చాయి..మళ్లీ మాట మర్చాడు..ప్రత్యేకహోదా కావాలంటున్నాడు.రేపు ఎన్నికలు అయిపోయక ఏమంటాడో చంద్రబాబుకే తెలియదు.గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు...ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు.చంద్రబాబు ఎప్పుడు ఒక మాట కాదు..అందుకే రెండు వ్రేలు చూపిస్తారు.ఆయను రెండు నాలికలు ఉన్నాయని చెపుకోవడమని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు దమ్ముంటే నిజం చెప్పాలి.వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకహోదా పోరాటాలు చేశారు.ఢిల్లీలో ధర్నాలు చేశారు.

ఆంధ్ర రాష్ట్రంలో నిరాహార దీక్షలు చేశారు.బంద్‌లు చేస్తారు.రాస్తారోకోలు చేశారు.జిల్లాల్లో యువభేరీలు పెట్టారు.చివరికి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానాలు చేశారు.రాజీనామాలు చేశారు.చంద్రబాబు దమ్ముంటే నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ ప్రత్యేకహోదాపై పోరాటం చేయకపోతే..నేడు చంద్రబాబు నోట ప్రత్యేకహోదా మాట వచ్చేదా..నేడు చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని ప్రత్యేకహోదా కావాలంటున్నారు.చంద్రబాబుకు నిజం చెప్పే దమ్ములేదు. ఎందుకో తెలుసా...నాన్న చెప్పేవారు..చంద్రబాబు నెత్తిమీద ఒక శాపం ఉందంట..ఏరోజు అయితే చంద్రబాబు నిజం చెప్పారో..ఆ రోజు చంద్రబాబు తలకాయ వెయ్యి ముక్కలు అయిపోతుదంట.చంద్రబాబు బీజేపీతో నాలుగు సంవత్సరాలు  సంసారం చేసి  వైయస్‌ఆర్‌సీపికి పొత్తు ఉందని ఆరోపణలు చేస్తున్నారు.మాకు బీజేపీతో పొత్తు ఉంటే ఈ పాటికి కేసులన్నీ మాఫీ చేయించుకునేవారం కాదా.. కేసీఆర్‌తో మాకు  పొత్తు ఉందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి కేసీఆర్‌ తో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు కాదా..ఆఖరికి హరికృష్ణ మృతదేహం పక్కన ఉందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొత్తు కోసం కేటీఆర్‌తో వెంపర్లాడింది చంద్రబాబు.మాకు ఎవరితోనూ పొత్తుల్లేవు..మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింగిల్‌గానే వస్తోంది.బంపర్‌ మెజార్టితో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి.సింహం సింగిల్‌ గా వస్తోంది..నక్కలే గుంపులుగా వస్తాయి. చంద్రబాబు కాంగ్రెస్, జనసేన, మమతా బెనర్జీ,పారూక్‌ అబ్ధులా,దేవగౌడ, క్రేజీవాల్‌ అంటూ ఎవరి తోడు వస్తే వారిని తెచ్చుకున్నాడు.

పవన్‌కల్యాణ్‌ ఒక యాక్టర్‌..రాజకీయ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ యాక్టర్‌ అయితే..దానికి డైరెక్టర్‌ చంద్రబాబు..ఒక యాక్టర్‌ డైరెక్టర్‌ చెప్పింది చేయాలి. అందుకే పవన్‌కల్యాణ్‌  చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు.ఇద్దరు ఒక్కటే..కలిసి సీట్లు పంచుకుంటున్నారు.అందుకే చంద్రబాబుకు సంబంధించిన జేడీ లక్ష్మినారాయణ జనసేన నుంచి పోటిచేస్తున్నాడు.పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చపార్టీ వాళ్లు హల్‌చల్‌ చేస్తారు.జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్లే..తెలుగుదేశం పార్టీ ఓటువేస్తే పవన్‌కల్యాణ్‌కు వేసినట్లే..ఆ పార్టీకి పెట్టింది.చిరంజీవి ప్రజారాజ్యం అని పెట్టారు. ఆ పార్టీని పెట్టింతే  కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా..కాని ఏంచేశారు. ఈ ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా కాంగ్రెస్‌ పార్టీకి అమ్మేశారు. అన్నతమ్ముడికి పోలికలు ఉంటాయి కాదా..జనసేన పార్టీని కూడా హోల్‌సేల్‌గా అమ్మేస్తారు.కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు అంతే తేడా..మీ భవిష్యత్‌ నా బాధ్యత అంటూ చంద్రబాబు చెప్పుఉంటూ తిరుగుతున్నాడు దొంగబాబు నమ్ముతారా..తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని లూటిచేశారు.

విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువచేసే భూమిని బినామీలకు ఇచ్చి స్వాహా చేసేశారు.900 కోట్ల విలువచేసే భూమిని లూలూ కంపెనీకి ఇచ్చేశారంట..ఇదే న్యాయమేనా..ఎవరికి ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పమంటే చెప్పరు. ఐదేళ్లు ప్రజల భవిష్యత్‌ చంద్రబాబు బాధ్యత కాదా..లోకేష్‌ భవిష్యత్‌ మాత్రమే చంద్రబాబు బాధ్యత.పొరపాటున మన భవిష్యత్‌ వీరి చేతుల్లో పెడితే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీరు.తస్మాత్‌ జాగ్రత్త. టీడీపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. చంద్రబాబు ఇచ్చిన హామీల బాకీని తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు.. దాని ప్రకారం పిల్లల ఫీజులు చెల్లించమని అడగండి. ఆడపిల్ల పుడితే 25వేలు డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.. చేశారా?. కాలేజ్‌ విద్యార్థులకు ఐ ప్యాడ్‌ ఇస్తామని అన్నారు.. ఇచ్చారా?. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తామని చెప్పాడు.. ఇచ్చారా?. ఇవన్నీ మీ హక్కుగా టీడీపీని అడగండి. ఇంటికోక ఉద్యోగం అన్నాడు.. లేకపోతే రెండు వేలు ఇస్తానని వాగ్ధానం చేశారు. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారు అన్నమాట. పేదలకు మూడు సెంట్ల భూమి ఇచ్చాడా?. రాష్ట్రంలో దోచుకున్న భూములను రాసి ఇవ్వమని చెప్పండి. ఎన్ని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు మీకిచ్చిన బాకీ తీర్చలేరు. మళ్లీ మోసపోకండి. 

 

Back to Top