బాకీ మొత్తం తీర్చమని బాబును నిలదీయండి

నారాసుర రాక్షసులను మళ్లీ నమ్మి మోసపోవద్దు

చంద్రబాబుది పూటకో వేషం.. రోజుకో డ్రామా

ప్రత్యేక హోదా ద్రోహులు చంద్రబాబు, బీజేపీ

ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావని ప్రజలు మళ్లీ ఓట్లేయాలి

రావణాసురుడి పాలన పోవాలంటే జగనన్న రావాలి

ఉంగుటూరు ప్రచార సభలో వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల

ఉంగుటూరు: చంద్రబాబు ప్రతి ఇంటికి లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. ఐదేళ్లుగా ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్నికలు వచ్చాయి. టీడీపీ నేతలు మీ ఇంటికి ఓట్ల కోసం వస్తారు. ముందు మీ బాకీ తీర్చాకే ఓట్లు అడగమని నిలదీయండి. కొల్లేరులో చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు బాధపడుతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి సమస్య తీరుస్తాం. రీ సర్వే చేయిస్తాం. అదనంగా వచ్చే భూమిని స్థానికులకే ఇస్తాం. ప్రతి విషయంలో అండగా ఉంటాని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల ఉంగుటూరు ప్రజలకు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలనులో వైయస్‌ షర్మిల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

అవినీతి, అబద్ధాలు, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు, రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అదే మొదటి సంతకం అని అన్నాడు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయింది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానన్నాడు. ఒక్క రూపాయి రుణమాఫీ కూడా కాలేదు. ఆ రుణం మీద వడ్డీలకు పసుపు – కుంకుమ మీద ఇచ్చే డబ్బులు సరిపోతున్నాయా..? చంద్రబాబు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికి పసుపు – కుంకుమ పథకాన్ని తీసుకొచ్చాడు. మహిళలను ఘోరంగా వచ్చించాడు. 

విద్యార్థులకు పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ లేదు. తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారని మన రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రుల లిస్టులు తీసేశారు. పేదవాడికి జబ్బు వస్తే ప్రభుత్వ ఆస్పత్రికే వెళ్లాలంట. చంద్రబాబు, ఆయన కుటుంబానికి జబ్బు చేస్తే కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్తారంట. ఇది అమానుషం కాదా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజల గురించి ఇలాగేనా ఆలోచన చేసేది. 

పోలవరం నుంచి కమిషన్లు దండుకోవాలని రూ. 15 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు అంచనాలను రూ. 60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు. నిజంగా చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటే ఈపాటికి పోలవరం పూర్తయ్యేది. హైదరాబాద్‌ అంతా నేనే కట్టేశాను.. అమరావతి కూడా నేనే కట్టేస్తాను.. అనుభవం అని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. రాజధానిలో ఒక్క శాశ్వత భవనం అయినా కట్టాడా.. ఒక్క ఫ్లైఓవర్‌ అయినా కట్టాడా..? రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుంది. ఈ చంద్రబాబు మొత్తం మింగేశాడు తప్ప ఒక్క మంచి పనిచేశాడా.. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. ఐదేళ్లు అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఒక్క పర్మినెంట్‌ బిల్డింVŠ  కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట. చెవుల్లో పువ్వులు, క్యాబేజీలు పెడతాడంట. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. చంద్రబాబు కొడుక్కు మాత్రమే ఉద్యోగం వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు. పప్పుకు కనీసం జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. కొడుక్కు మాత్రం మూడు ఉద్యోగాలు ఇస్తాడు.. మామూలు ప్రజలకు ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్లు లేవు. 

ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి అయిన హోదాను తెలుగుదేశం, బీజేపీ ఒక్కటై ఇవ్వకుండా మోసం చేశారు. బీజేపీ హోదా ఇవ్వమని చెప్పినా చంద్రబాబు నాలుగేళ్లు సంసారం చేశాడు. బీజేపీ ద్రోహం చేయడానికి కారణం చంద్రబాబు. గత ఎన్నికలకు ముందు హోదా 15 ఏళ్లు కావాలన్నాడు. అధికారంలోకి వచ్చాక కమీషన్ల కోసం ప్యాకేజీ తీసుకున్నాడు. మళ్లీ ఎన్నికలు వచ్చాయని హోదా అంటున్నాడు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. అందుకే నాకు రెండు నాలుకలని చంద్రబాబు వేళ్లు చూపిస్తుంటాడు. చంద్రబాబుది రోజుకో మాట.. పూటకో వేషం. బాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీమాలు కూడా చేశారు. దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ పోరాడితేనే కదా.. యూటర్న్‌ తీసుకొని హోదా కావాలంటున్నాడు. 

కేసీఆర్‌తో పొత్తుకోసం వెంపర్లాడింది ఇదే చంద్రబాబు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకొని పొత్తుకోసం మంతనాలు జరిపాడు. నాలుగేళ్లు చంద్రబాబు బీజేపీతో సంసారం చేశాడు. ఇప్పుడు వైయస్‌ఆర్‌ సీపీకి కేసీఆర్, బీజేపీతో పొత్తు ఉందని ఆరోపిస్తున్నాడు. మాకు ఎవరితోనూ పొత్తు లేదు. మాకు ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే, వైయస్‌ఆర్‌ సీపీ సింగిల్‌గానే.. బంపర్‌ మెజార్టీతో గెలుస్తారని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్, జనసేన ఇంకా ఎవరు తోడు వస్తే వాళ్లతో కలిసి వస్తున్నాడు. 

ఎన్నికలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి ఓట్లు ఆడుగుతారు.. ఆడపిల్ల పుడితే ప్రతి ఇంటికి రూ. 25 వేలు ఇస్తామన్నారు. ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రికి రూ. 25 వేలు చంద్రబాబు బాకీ.. ముందు ఆ బాకీ తీర్చమని చెప్పండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. అంటే ఈ ఐదేళ్లలో తల్లిదండ్రులు వారి పిల్లల కోసం కట్టిన ఫీజుంతా బాకీ.. విద్యార్థులకు ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అన్నారు. ఎన్నికల్లోపూ అవన్నీ ఇచ్చేయమని నిలదీయండి. తెలుగుదేశం పార్టీ వారు మీ ఇంటికి ఓటు కోసం వస్తే ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇల్లు అన్నారు. వేల ఎకరాలు అమరావతి, విశాఖలో మింగేశారు.ఆ భూమంతా మీదే రాసివ్వమని అడగండి. చేనేతలు, డ్వాక్రా మహిళలకు, రైతులకు మొత్తం రుణమాఫీ అన్నాడు.. ఆ రుణమంతా చంద్రబాబు మీకు బాకీ.. ముందు ఆ బాకీ తీర్చమని అడగండి. ఐదేళ్లలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ వారు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ సంగతి తీర్చమనండి. మన ఓట్లు కొనడానికి డబ్బులు తీసుకొని వస్తారు. తీసుకొని మోసపోకండి.

మీ భవిష్యత్తు నా బాధ్యత అని దొంగబాబు చెప్పుకొని తిరుగుతున్నాడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబుకు ప్రజల బాధ్యత గుర్తులేదా.. పప్పు ఒకడే బాధ్యతా..? మళ్లీ మోసపోకండి. నారా రూర రాక్షసులు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేశారు. లంచగొండి తనం ఎక్కడా చూసినా కనిపిస్తుంది. స్వార్థపరులను ప్రోత్సహిస్తున్నారంటే చంద్రబాబు ఒక నాయకుడేనా..? మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. పది నాలుకల రావణాసురుడు పోవాలంటే జగనన్న రావాలి. కొడుక్కు మాత్రమే జాబు ఇచ్చిన వాడు పోవాలంటే జగనన్న రావాలి. ప్రతి రైతు రాజులా తలెత్తుకొని బతుకుతాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రైతుకు మే నెలలోనే రూ. 12,500లు ఇస్తారు. రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి కూడా ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులను ఆదుకునేందుకు రూ. 4 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణమంతా నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతారు. మళ్లీ సున్నావడ్డీకే రుణాలు అందిస్తారు. ప్రభుత్వమే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా ఇంజనీరింగ్, డాక్టర్‌ పెద్ద చదువులు చదివిస్తుంది. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. తల్లులు పిల్లలను బడికి పంపిస్తే రూ. 15 వేలు ఇస్తారు. అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేలు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు రూ. 3 వేల పెన్షన్, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, ఆరోగ్యశ్రీకి పునర్జీవం తీసుకువస్తాం. కొల్లేరులో చాలా సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత కొల్లేరు ప్రతి సమస్య తీరుస్తాం. రీ సర్వే చేయిస్తాం. అదనంగా వచ్చే భూమిని స్థానికులకే ఇస్తాం. ప్రతి విషయంలో అండగా ఉంటాం. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. మీ సేవ చేసుకునే అవకాశం రాజన్న కొడుకు జగనన్నకు ఇవ్వాలని కోరుతున్నాం. 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాసరావు అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఫ్యాన్‌ గుర్తుపై మీరు వేసే ప్రతి గుర్తు రాజన్న రాజ్యానికి వేసినట్లు. 

 

Back to Top