వైయస్ రాజశేఖర్ రెడ్డి భవనం బ్లాక్- 2 ఏరియా ఆసుప‌త్రి ప్రారంభం

  గుడివాడ‌: మ‌హానేత‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భ‌వ‌నం బ్లాక్‌-2 ఏరియా ఆసుప‌త్రిని మంత్రి విడ‌ద‌ల ర‌జిని, ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. రూ. 10.28 కోట్ల తో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్వ‌త‌హాగా వైద్యుడు కాబట్టే సీఎంగా వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెచ్చి..... దేశానికే ఆదర్శంగా నిలిచార‌న్నారు. ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలో 90 శాతం మందికి ప్రయోజనం క‌లుగుతుంద‌న్నారు. దమ్ముంటే ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసిన గుడివాడలో కొడాలి నానిను ఓడించడం అసాధ్యమ‌న్నారు.  మేనిఫెస్టో పేరుతో నాటకాలు ఆడుతున్న చంద్రబాబు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు. ఇచ్చిన హామీలను పూర్తిచేసిన వైయ‌స్‌ జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారని మంత్రి చెప్పారు. చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసిన గుడివాడలో కొడాలి నానిను ఓడించలేరని, టిడిపి నేతలు కేవలం డైలాగులకు మాత్రమే పరిమితం అవుతారని మంత్రి రజిని ఎద్దేవా చేశారు. ప్రజలు, జగన్ ఆశీస్సులతో పాటుగా ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా కొడాలి నానికు ఉన్నాయని మంత్రి రజిని అన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వైఎస్ఆర్ జయంతి రోజు హాస్పిటల్ ప్రారంభించుకోవడం సంతోషకరమని ఎమ్మెల్యే కొడాలి నాని హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పరిస్థితి తెలుసుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి అడగకుండానే 10 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆయన తెలియజేశారు. అనతికాలంలోనే అత్యాధునిక హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తిచేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థ, వైద్య శాఖ అధికారులకు ఎమ్మెల్యే కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంవి.నారాయణరెడ్డి ,  కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతా బాయి, వైసిపి నాయకులు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశి భూషణ్ , ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి, పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి ,వైద్య శాఖ అధికారులు, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

Back to Top