వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు పులివెందుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి, వేంపల్లి మండలం లోని నందిపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై స్థానికులతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యలను తెలుసుకుంటారు. రాత్రికి పులివెందుల నివాసంలో బస చేయనున్నారు. వైయస్ జగన్ పర్యటనతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.