మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ..

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్షలు
 

తాడేప‌ల్లి: స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి భారతీయుడి హృద‌యం గ‌ర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ 78వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నాను.’’ అంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top