పంచాయ‌తీరాజ్ పార్టీ విభాగం డైరీ ఆవిష్క‌రించిన వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయ‌తీరాజ్‌ విభాగం డైరీ 2025ను  పార్టీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర కార్యాల‌యంలో నూత‌న సంవ‌త్స‌ర డైరీని వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించి పార్టీ నేత‌ల‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయం సమృద్ది దిశగా తీసుకున్న చర్యలను  వైయస్‌ జగన్ ప్ర‌స్తావించారు. పంచాయ‌తీ రాజ్ విభాగం ప్ర‌తినిధులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ పంచాయ‌తీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీపీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top