తాడేపల్లి: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ త్వరగా కోలుకోవాలంటూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్‌ఖడ్ దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ‘‘ఎంతో అంకితభావంతో ఆయన దేశం కోసం పని చేశారు. అనారోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేసిన ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యంతో ఎప్పట్లాగే దేశ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.