హత్యలు చేసేది వాళ్లే..విచారణ చేసేది వాళ్లే

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాను

అక్కా, చెల్లెమ్మలందరికీ నేనున్నాను అనే భరోసా ఇస్తున్నా

రాయచోటికి హంద్రినీవాకు కృష్ణా జలాలు రావాలి

ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు

ఐదేళ్ల పాలనలో అవ్వాతాతలను పట్టించుకోలేదు

ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు దేనికైనా వెనుకాడరు

మా చిన్నాన్నను హత్య చేయించింది చంద్రబాబే

ఎన్నికల్లో గెలవడం కోసం రోజుకో డ్రామా చూపిస్తున్నారు

జిల్లా నుంచి మైనార్టీలకు మొదటి ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తా

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

రాయచోటి: ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని, ఓట్లు తొలగిస్తారు..దొంగ ఓట్లు చేర్పిస్తారని, చివరకు మనుషులను హత్యలు కూడా చేస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. హత్యలు చేసేది వాళ్లే..విచారణ చేసేది కూడా వాళ్లే అని మండిపడ్డారు. సొంత చిన్నాన్నను చంద్రబాబు హత్య చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నానని, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

 కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలిచారు. కష్టాల్లో అండగా నిలిచారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ముందుగా రెండు చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర జరిగింది. దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో రాష్ట్రంలోని ప్రతి మూల తిరిగాను. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాను. మీరందరూ బాగుండాలని, మీ సంతోషంలో నా పాత్ర కూడా ఉండాలని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ అందరి గుండె చప్పుడు విన్నప్పుడు ఈ మాటలు నా మనసులోనే నిలిచాయి. ఒక సగటు మనిషి, సగటు కుటుంబం ఏం కోరుకుంటుందన్నది నా సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాను. ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మంచి చేయాలని భావిస్తుంది. ఇంటింటికి మంచి చేయాలన్న పాలన ఆ దివంగత నేత వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలోనే చూశాం. నాన్నగారు చనిపోయిన తరువాత అటువంటి పాలన ఈ రోజు కనిపించడం లేదు. రాష్ట్రంలో పేదవాడు , మద్య తరగతి కుటుంబాలు పడుతున్న కష్టాలు, బాధలు విన్నాను. వీళ్ల కష్టాలను చూశాను. ఈ వేదిక నుంచి మీ అందరికి కూడా భరోసా ఇస్తున్నాను.. నేనున్నానని చెబుతున్నాను. ఒక రైతు కుటుంబాన్ని తీసుకుంటే బాగుండటానికి ఏం కోరుకుంటాడు. రైతుల నుంచి ఆలోచనలు విన్నప్పుడు..సాగు బాగా జరగాలని, తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటాడు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడుల కోసం సాయం చేయాలని ఆశీస్తారు. గిట్టుబాటు ధరలకు ముందుండి సాయం చేయాలని ఆరాటపడుతారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నా పాదయాత్రలో ఆవేదన చూశాను. ప్రతి రైతు ఆందోళన విన్నాను. ఆ రైతుల కష్టాలు తీర్చడానికి మీ అందరికి భరోసా ఇస్తున్నాను. మీ బాధలు విన్నాను. మీ కష్టాలు చూశాను. మీకు నేనున్నానని భరోసా ఇస్తున్నాను. 
జనాభాలో 50 శాతం పైగా మహిళలు ఉన్నారు. ఆ అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 93 లక్షల మంది పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలు ఉన్నారు. ఐదేళ్లుగా మోసపోయిన ఈ అక్కచెల్లెమ్మల బాధలు నేను విన్నాను. వాళ్ల ఆవేదన విన్నాను. వాళ్లందరికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తున్నాను..నేనున్నానని భరోసా కల్పిస్తున్నాను. ఆడపిల్లలు బయటకు వెళ్తే భద్రత ఉంటుందనుకుంటే ఏ కుటుంబమైనా సంతోషిస్తుంది. పాదయాత్రలో అక్కచెల్లెమ్మల బాధలు విన్నాను. మోదటి సంతకంలోనే బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ఐదారు బెల్టు షాపులు ఉన్నాయి. ఆడవాళ్లు ఏడు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఆ అక్కచెల్లెమ్మల వేదనలు విన్నాను. కష్టాలు చూశాను. నేనున్నాను మీకు తోడుగా అని చెబుతున్నాను.
ఫీజులు కట్టలేమనే పరిస్థితి ఉంటే పిల్లలు చదువులకు దూరమవుతారు. ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో చదువులు చదువుకోలేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. అప్పులు చేస్తున్న తల్లిదండ్రులను చూశాను. వారి బాధలు విన్నాను. ప్రతి తల్లిదండ్రులకు, పిల్లలకు చెబుతున్నాను. మీకు తోడుగా నేనున్నానని భరోసా ఇస్తున్నాను.
చదివించిన చదువులకు ఉద్యోగాలు రావడం లేదు. చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారు. ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయడం లేదు. డిగ్రీ చదవినా ఉద్యోగాలు రావడం లేదు. పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇదే జిల్లాలో పక్కనే కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కడుతారేమో అని ఆశగా చూశారు. ఇది కట్టి ఉంటే 10 వేల ఉద్యోగాలు వచ్చేవి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొత్త పరిశ్రమలు రావు. పాత పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఉద్యోగాలు ఇస్తామన్నారు. నెల నెల రూ.2 వేలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇస్తామని చెప్పి బాకీ పడ్డారు. ఆ పిల్లాడి బాధలు విన్నాను. ఆ ప్రతి పిల్లాడికి చెబుతున్నాను. మీ బాధలు విన్నాను. మీ అందరికి నేనున్నానని మాట ఇస్తున్నాను.
ఆరోగ్యశ్రీలో జబ్బు నయం కాక ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం దెబ్బతిన్న పరిస్థితి చూశాను. 108కి ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్‌ రాకపోవడంతో చనిపోయిన పరిస్థితి చూశాను. దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితమైన పరిస్థితి చూశాను. ఆ పేదవాడు చెప్పిన కథలు విన్నాను. ఆరోగ్యం నయం చేసుకునేందుకు ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి చూశాను. మీ బాధలు నేను విన్నాను. మీ కష్టాలు చూశాను కాబట్టి మీ అందరికి నేనున్నానని భరోసా ఇ స్తున్నాను.
బాబు హయాంలో పింఛన్‌ చివరి మూడు నెలల్లో మాత్రమే పెరుగుతుంది. ఐదేళ్ల కాలంలో 57 నెలలు పెరగదు. చివరి మూడు నెలల్లో పింఛన్లు పెంచుతారు. జగన్‌ అనే ప్రతిపక్ష నేత చెబితే కాని ఈ ప్రభుత్వం పెంచదు. ఆ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల బాధలు నేను విన్నాను. వారి కష్టాలు చూశాను. పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే. ఆ ప్రతి అవ్వా తాతకు నేను చెబుతున్నాను. మీ అందరికి నేనున్నానని చెబుతున్నాను.
నేను విన్నాను..నేను ఉన్నాను..
ఆ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన చూశారు. ఒ క్కసారి అవకాశం ఇవ్వండి నాన్నగారి పాలన మళ్లీ తీసుకువస్తానని మాట ఇస్తున్నాను. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఐదేళ్లుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన మీ అందరికి తెలుసు. ప్రతి అడుగులోనూ మోసం..అబద్ధం కనిపిస్తుంది. అన్యాయం, అరాచకం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏమైనా చేస్తారు. ఎంతటి అన్యాయమైన చేయడానికి వెనుకాడడు. ఇదే పెద్దమనిషి చంద్రబాబు పాలనలో మీరు చూశారు. రోజుకో కొత్త సినిమా కనిపిస్తుంది. గెలవడం కోసం చేయని అన్యాయం ఉండదు, మోసం ఉండదు, ఉన్న ఓట్లను తీసేస్తారు. దొంగ ఓట్లను చేర్పిస్తారు. ఆధార్‌ డిటెల్స్, బ్యాంకు డిటైల్స్, ఆడవారి టెలిఫోన్‌ నంబర్లు తీసుకుంటారు. ఆ జన్మభూమి కమిటీలకు ఇస్తారు. గెలవడం కోసం రోజుకో సినిమా చూపిస్తారు. చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనుకాడడు. వైయస్‌ఆర్‌ జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీకి అండగా ఉంటున్న మా చిన్నాన్నను చంపడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు. హత్య చేసేది వాళ్లే..మళ్లీ విచారణ చేసేది వాళ్ల పోలీసులే. మళ్లీ దొంగ రాతలు రాసేవన్నీ కూడా వాళ్ల పేపర్లు, వాళ్ల టీవీలే. ఇవాళ యుద్ధం ఒక్క చంద్రబాబుతోనే కాదు..ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోంది. అమ్ముడపోయిన మీడియాతో యుద్ధం జరుగుతోంది. ఎన్నికలు జరిగితే చాలు చంద్రబాబు మూటల కొద్ది డబ్బులు పంపిస్తున్నారు. మీరంతా కూడా ప్రతి ఒక్కరిని కలవండి.  ప్రతి ఒక్కరికి చెప్పండి. అక్కా..చంద్రబాబు రూ.3 వేలు డబ్బులు చేతిలో పెడితే మోసపోవద్దు..20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తారని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. ఇవాళ మన పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించేందుకు ప్రతి ఏటా రూ.20 వేలు  ఇస్తామని చెప్పండి.  గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతారు..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. వ్యవసాయానికి ఏడాదికి రూ.12500 ఇస్తారని చెప్పండి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. అక్కా..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..రేపు పొద్దున అన్న ముఖ్యమంత్రిఅవుతారు. అన్న వైయస్‌ఆర్‌ చేయూత పథకం తీసుకువస్తారు. ప్రతిఒక్కరికి ఉచితంగా రూ.75 వేలు ఇస్తారని చెప్పండి. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు అంతా కూడా నేరుగా నాలుగు ధపాలుగా మీ చేతుల్లో పెడతారని చెప్పండి. బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకే డబ్బులు ఇప్పిస్తారని, అన్న చెప్పాడు..ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తాడని చెప్పండి. అవ్వా తాతల వద్దకు వెళ్లి ..అన్న వస్తున్నాడు..పింఛన్‌ రూ.3 వేలు ఇస్తాడని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లండి. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయాలని దీవించమని ప్రతి ఒక్కరిని కోరండి. మీ నియోజకవర్గానికి నేను ఒక మాట ఇచ్చాను. మైనారిటీ సోదరులకు కూడా మాట ఇచ్చాను. వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చిన వెంటనే మైనారిటీలకు మొట్ట మొదల ఎమ్మెల్సీ పదవి ఇస్తాను.  ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వడానికి కూడా కాస్త ఆలోచన చేశాను. కడపలో అంజాద్‌బాషాకు ఇచ్చాను కాబట్టి సాధ్యం కాలేదు. చిత్తూరు జిల్లాలో మైనారిటీలు బాధపడుతారని మదనపల్లిలో మైనారిటీకి టికెట్టు ఇచ్చాం. కాలేజీ గ్రౌండ్స్‌కు సంబంధించి సమస్యను పరిష్కరిస్తాను. మీ అందరి ఆశీస్సులు వైయస్‌ఆర్‌సీపీకి కావాలని, శ్రీకాంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా, మిథున్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top