చంద్రబాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా?

గిద్దలూరు సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

చంద్రబాబు పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు

దేశంలో ధనిక సీఎం చంద్రబాబు అయితే..అత్యంత పేదవాడు రైతు

ఉద్యోగాలు రావడం దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి

మనందరి ప్రభుత్వం వచ్చాక కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే 

చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు

పెట్టుబడి సాయం ప్రతి రైతుకు మే నెలలో రూ.12500

మన పాలనలో సున్నా వడ్డీకే రైతులకు రుణాలు

 

ప్రకాశం: చంద్రబాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఒక్కరికీ కూడా ఉద్యోగాలు రాలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..

  •  గిద్దలూరులో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా తాగునీటి సమస్య లేని గ్రామం కనిపించదు. దాదాపుగా 230 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. తొమ్మిదినెలలుగా నీటి సరఫరా కోసం ట్యాంకర్ల యజమానులకు రూ.9 కోట్లు ఇవ్వకపోవడంతో నీటిని సరఫరా చేయడం లేదు. పట్టించుకునే నాథుడు లేడు. నీటిలో ఫ్లోరైడ్‌ శాతం 46 మండలాల్లో ఎక్కువగా ఉంది. మోకాళ్ల నొప్పులు, కాళ్లు అరిగిపోవడం, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఈ బాధలు తాళలేక చనిపోవడాలు, అప్పులపాలు అవుతున్నారు. ఈ సమస్య తీరాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితేనే పరిష్కారం లభిస్తుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఈ పాలకులకు రావడం లేదు. 
  •  ఇదే నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నుల ్రçపాజెక్టు నాన్నగారి హయాంలో 15 కిలోమీటర్లు పూర్తి చేశారు.  రెండో టన్నల్‌లో పది కిలోమీటర్లు వైయస్‌ఆర్‌ హయాంలో జరిగింది. ఇవాళ్టి వరకు కూడా ఈ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇంతకన్న దారుణమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? అని అడుగుతున్నాను.
  •  ఇదే గిద్దలూరు టౌన్‌లో నీటి సమస్యను తీర్చేందుకు 14 గ్రామాలకు నీరు అందించేందుకు అప్పట్లో నాన్నగారు బైరేని గుండాల ప్రాజెక్టును అప్పట్లోనే మొదలు పెట్టి 50 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. ఒకవైపున నీళ్లు లేవు. బోర్లు వేస్తే వేల అడుగులు వేయాల్సి వస్తోంది. నీళ్లలో ప్లోరైడ్‌ ఉంటుంది. కొద్దో గొప్పో పంట పండిస్తే మద్దతు ధర లభించడం లేదు. పత్తి, మిర్చి, శనగ, కంది పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతన్నలు అంటున్నారు. ఏమాత్రం పట్టించుకోని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? .
  •  చంద్రబాబు పాలన గురించి ..ఆయన దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని రిపోర్టులు చెబుతున్నాయి. మన రైతు మాత్రం దేశంలోనే అత్యంత పేద అని సర్వేలు చెబుతున్నాయి. అత్యంత రుణభారంలో రైతు ఉన్నారని నాబార్డు నివేదికలు చెబుతున్నాయి. మన పొదుపు సంఘాల్లో అప్పులు రూ.14 వేల కోట్లు ఉంటే..వడ్డీతో కలిసి ఇవాళ రూ.26 వేల కోట్లకు రెట్టింపు అయ్యాయి. ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయని బ్యాంకర్ల మీటింగ్‌లో చంద్రబాబుకు నివేదికలు ఇస్తున్నారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి.
  •  మన నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు హయాంలో రైతులు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులు ఎవరూ కూడా బాగుపడలేదు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? లేక ప్రజలు బాగుంటే బాబు బాగున్నట్లా?
  • గతంలో జాబు రావాలాంటే బాబు రావాలన్నారు. ఇవాళ జాబు రావాలంటే బాబు పోవాలంటున్నారు. ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలని వినిపిస్తోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జాబు కోసం యువత, నిరుద్యోగులు డిగ్రీలు చేతపట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. మన రాష్ట్రంలో కోటి 70 లక్షల ఇళ్లులు ఉంటే..ఈ పెద్ద మనిషి ఇంటికో ఉద్యోగం అన్నారు. లేదంటే నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తామని ఎగ్గోట్టారు.
  •  చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఐదేళ్లలో అదిగో ఉద్యోగాలు..ఇదిగో ఉద్యోగాలు అంటూ ఆశలు చూపారు. ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు.
  •  చంద్రబాబు పాలనలో మనకు కనిపించించేది ఏంటంటే..ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.బాబు వచ్చాడు..30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా? బాబు వచ్చాడు..గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్స్‌పెక్టర్లు ఉద్యోగాలు గోవిందా? వెయ్యి మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవిందా? ఆయుస్సులో పని చేస్తున్న 800 ఉద్యోగాలు గోవిందా..సాక్షరాభారత్‌లోని 30 వేల ఉద్యోగాలు గోవిందా..మధ్యాహ్న భోజనంలో పని చేస్తున్న 80 వేల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..అంగన్‌వాడీల నుంచి వెలుగు ఉద్యోగుల వరకు జీతాలు పెంచమంటే నిర్ధాక్షిణ్యంగా కేసులు పెడుతున్నారు.  అన్యాయమైన పాలన రాష్ట్రంలో కనిపిస్తోంది.
  •  చంద్రబాబు పాలన ఎలా ఉందని 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నా వద్దకు వచ్చి చెప్పారు. చదువు పూర్తి చేసిన యువకులు నావద్దకు వచ్చి చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. మీ కష్టాన్ని నేను చూశాను..మీ బాధను విన్నాను. మీ అందరికీ నేనున్నానని హామీ ఇస్తున్నాను.
  •  రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. మనందరి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ఉద్యోగం కోసం వెతికే ప్రతి పిల్లోడికి ఇవాళ హామీ ఇస్తున్నాను. మీ ప్రతి ఊరులోనూ గ్రామ సచివాలయం తెరుస్తాను. అందులోనే మీ ఊరి పిల్లలకు 10 మందికి ఉద్యోగాలు ఇస్తానని మాట ఇస్తున్నాను. మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, భూ రికార్డులు ఇలా ఏ సమస్య అయినా సరే జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాల్సిన పని లేదు. మీకు ఏమి కావాలన్నా 72 గంటల్లోనే  ఇప్పిస్తాం. కులం, మతం, రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇప్పిస్తాం. గ్రామ సచివాలయాలకు అనుసందానంగా ప్రతి 50  ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఏర్పాటు చేస్తాం. వారికి రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలను గ్రామ వాలంటీర్లకు అప్పగిస్తాం. సంక్షేమ పథకాలు ఈ వాలంటీర్‌ ద్వారా డోర్‌ డెలీవరీ చేస్తామని హామీ ఇచ్చారు. 
  •  ఉద్యోగాల కోసం ఇంకొక అడుగు ముందుకు వేస్తు..రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. వచ్చిన పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకు రావడం లేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. మనందరి ప్రభుత్వం రాగానే మొట్ట మొదటి చట్టసభలో ఒక బిల్లు తెస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు లోకల్‌ వారికి ఇవ్వాలని చట్టం చేస్తాం. ఆ పరిశ్రమలకు దెబ్బ తగులకుండా ఉండేందుకు ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా చేసి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇస్తాం. దాని వల్ల పిల్లలకు, పరిశ్రమలకు మేలు జరుగుతుంది. ఉద్యోగాల కల్పనలో ఇంకొ అడుగు ముందుకు వేస్తాం. గవర్నమెంట్‌ కాంట్రాక్టు పనుల్లో బస్సులు, కార్లు అద్దెకు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువతకే ఇస్తాం. నిరుద్యోగ యువతకు పెట్టుబడి కోసం సబ్సిడీ ఇస్తామని మాటిస్తున్నాను. యువత గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకే 50 శాతం ఇస్తాం.
  •  రేపు పొద్దున 25కు 25 ఎంపీలను గెలిపించుకొని ఆ తరువాత కేంద్రంలో ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తామని చెబుతాం. కేంద్రంలో ఏ పార్టీ కూడా ఫుల్‌ మెజారిటీతో అధికారంలో వచ్చే విధంగా కనిపించడం లేదు. ఎవరైతే హోదా ఇస్తారో వారికే మద్దతు ఇస్తాం. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, హోటల్స్, ఆసుపత్రలు వస్తాయి. ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందని చెబుతున్నాను. దేవుడు ఆశీర్వదించి ఇవన్నీ చేయగలిగే ఉద్యోగాలకు పరిష్కారం దొరకుతుంది. 
  •  మరో 12 రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ప్రతి రోజు కుట్రలు, కుతంత్రాలు జరగుతున్నాయి. ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరగుతున్న యుద్ధంలో చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు నిజం చేసేందుకు పడరానిపాట్లు పడేందుకు అగచాట్లు పడుతున్నారు. ఈ కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎన్నికల్లో గెలిచేందుకు గ్రామాలకు మూటల కొద్ది డబ్బు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేల డబ్బులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. మీరంతా కూడా మీగ్రామాల్లో ప్రతి ఒక్కరిని కలవాలి. 
  •  ప్రతి ఒక్కరికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయితే మన పిల్లలను బడికి పంపిస్తే రూ.15 వేలు ఏటా ఇస్తారని చెప్పండి. మన పిల్లలను ఉన్నత చదువులు చదివించే స్థితిలో మనం లేము. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. 20 రోజులుఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలు ఏం చదువుతారో అన్న ఉచితంగా చదివిస్తారని చెప్పండి.
  •  పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. గతంలో సున్నావడ్డీకే రుణాలు వచ్చేవి. చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ రుణాలు ఎగురగొట్టారని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే పొదుపు రుణాలు మొత్తం నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లో పెడతారని చెప్పండి.
  •  ప్రతి అక్కకు చెప్పండి..సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారని చెప్పండి. పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయ్యాక వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తెస్తారు. ప్రతి అక్కుSరూ.75 వేలు  ఉచితంగా ఇస్తారని చెప్పండి.
  •  గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు చెప్పండి..చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్న సీఎం అవుతారు. పెట్టుబడి కోసం ప్రతి ఏటా మే నెలలోనే రూ.12500 ఇస్తారని చెప్పండి. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాలేదు. అన్న సీఎం అయ్యాక రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ ఇస్తారని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారని చెప్పండి. 
  •  గ్రామాల్లో ఉన్న ప్రతి అవ్వాతాతలకు చెప్పండి. మీ మనువడు ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్‌ రూ.3 వేలకు పెంచుతూ పోతారని చెప్పండి. 
  •   ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ప్రతి పేదవాడికి ఇల్లు రావాలంటే జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చండి. నవరత్నాల ద్వారా పేదల జీవితాలు మారుతాయని నేను నమ్ముతున్నాను. రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తాన న్న విశ్వాసం ఉంది.
  •  గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా అన్నా రాంబాబు..ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిపై మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉంచాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.  

తాజా వీడియోలు

Back to Top