సంక్షేమ పథకాలు డోర్‌ డెలీవరి

భీమవరం సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

భీమవరం నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తాగునీరు లేదు

తుందు్రరులో ఆక్వా ఫ్యాక్టరీతో ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు

కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి

మళ్లీ చంద్రబాబుకు అధికారం ఇస్తే కనీసం రేషన్‌ అయిన ఇస్తారా?

వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ

 

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అ«ధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు డోర్‌ డెలీవరి చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి మీ ఊర్లోనే పదిమందికి ఉద్యోగాలు ఇస్తామని, 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..

  నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయగలిగానని గర్వంగా చెబుతున్నారు. నా పాదయాత్ర భీమవరం గుండా కూడా సాగింది. ఆ రోజు మీరంతా నా దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి బాధ, ప్రతి కష్టం ఇవాల్టికి గుర్తుంది. ఇదే భీమవరం టౌన్‌లోనే నాన్నగారు 2008లో 82 ఎకరాలు సేకరించి పేదవాళ్లకు ఇల్లులు కట్టాలని సేకరించారు. ఆ భూమిని చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా లాక్కొని, అవినీతి కూడిన ప్లాట్లను కట్టేందుకు నాంది పలికాడు. ఆ ప్లాట్లలో సిమెంట్‌ సబ్సిడీ ఇస్తారు. లిఫ్టులు, గ్రైనేట్‌ ఫ్లోరింగ్‌ కూడా ఉండవు. వాటికి అడుగుకు రూ. వెయ్యి అవుతుందని ఏ కాంట్రాక్టర్‌ అయినా చెబుతాడు.. కానీ అదే ప్లాట్లు 300 అడుగుల ప్లాట్లు అడుగుకు రూ. 2200 చొప్పున పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తున్నాడని పేదవారు వచ్చి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. రూ. 3 లక్షలత నిర్మాణమయ్యే ఆ ప్లాట్లు పేదవాడికి వచ్చే సరికి రూ. 22 వందలకు అమ్ముతూ.. రూ. 6.40 లక్షలకు అమ్ముతున్నారు. ఆ ప్లాట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది పోను మిగిలిన రూ. 3 లక్షలు ఆ పేదవాడు మీద అప్పుగా రాసుకుంటారంట.. చంద్రబాబు తీసుకున్న లంచాలకు 20 నెలల పాటు నెలకు రూ. 3 వేలకు కడుతూ పోవాలంట. 

ఆ ప్రతిపేదవాడికి మాటిస్తున్నా.. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను.. మాటిస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చిన తరువాత రూ. 3 లక్షల అప్పు మాఫీ చేస్తానని భరోసా ఇస్తున్నా. ఇదే భీమవరం నియోజకవర్గంలో అక్షరాల తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి 126 ఎకరాలు సేకరించి మంచినీటి చెరువులు పెట్టి తాగడానికి నీటిని సరఫరా చేశారని ప్రజలు చెప్పినప్పుడు సంతోషమేసింది. ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో భీమవరం చుట్టుపక్కల వీరవాసిరం మండలంలో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది. ఐదు సంవత్సరాల్లో తాగడానికి నీరు లేకపోతే ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఏం గాడుదులు కాస్తున్నాడని ప్రశ్నిస్తున్నా.. ఇదే భీమవరం నియోజకవర్గంలో చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డు కూడా లేదు. చెత్త మొత్తం టౌన్‌ మధ్యలోనే వేస్తుండడంతో ఆ దుర్వాసనకు, ఆ దోమలకు ప్రజలు రోగాల బారినపడుతున్నా.. కనీసం పట్టించుకునేవాడు కూడా లేడంటే.. బాబు నిద్రపోతున్నారా..

రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుంది ప్రజలు నానా అవస్థలు పడుతుంటే రాజకీయ లబ్ధిపొందేందుకు వచ్చి ఎలమందూరు డ్యామ్‌లో అఫ్లూయంట్‌ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్‌ పెట్టి నీళ్లు అన్ని శుధ్ది చేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మాట ఇచ్చాడు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో డ్యామ్‌ శుభ్రం చేశారా అని అడుగుతున్నా.. ఇదే భీమవరం నియోజకవర్గంలో ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్‌ యార్డు వరకు బైపాస్‌ రోడ్డు వేశారు. ఆ తరువాత ఆ రోడ్డు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఇదే భీమవరం నియోజకవర్గంలోనే రైతులు మద్దతు ధర అందడం లేదని వాపోయారు. రూ. 1750 అని చెబుతున్నారు. కానీ, కనీసం రూ. 12 వందలు కూడా అందడం లేదని ఆ రైతన్నలు ఆవేదనతో అన్న మాటలు ఇవాల్టికి గుర్తున్నాయి. 

వంద కౌంట్ల రొయ్యల ధర కనీసం రూ. 270 ఉంటే కానీ గిట్టుబాటు కాదు.. అటువంటిది రూ. 2 వందలు కూడా రావడం లేదంటే ఆక్వా రైతులు ఎలా బతుకుతారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. ప్రతి విషయంలోనూ దళారీలే. రైతులు పండించిన పంట, నీటిలో పండించే రొయ్యలు, చేపలు అమ్ముకునేందుకు కూడా దళారీ వ్యవస్థ తయారైంది. దళారీలు పంట కొనుగోలు చేసిన తరువాత రేట్లు పెరుగుతున్నాయి. ఇక్కడే తుందు్రరులో ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం వస్తుందని, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే.. ఫ్యాక్టరీని సముద్ర తీరానికి తీసుకువెళ్లాల్సిన చంద్రబాబు.. వారిపై జులం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ప్రజలకు కనీసం ఒక్కసారి కూడా తోడుగా ఉన్నానని చంద్రబాబు పార్ట్‌నర్‌ యాక్టర్‌ కనీసం ఒక్కసారైనా ఇచ్చారా.. ఒక్కడే ప్రతి అడుగులోనూ, ప్రతి సమస్యలోనూ నేను ఉన్నానని ఒక లోకల్‌ హీరో ఉండేవాడు.. ఆయనే శ్రీను అన్న, లోకల్‌ హీరోకు, సినిమా యాక్టర్‌కు మధ్య పోలికను మీరే తీసుకోండి. 

ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. చంద్రబాబు పాలనలో మీకు కనిపిస్తున్న విషయం. ఈ ఐదేళ్లలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఎన్నికల ప్రణాళికలో రాసిన రాతలు ఏంటీ..? ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు చేసిందేమిటని మీరంతా గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మోసం అనే పదాన్నే చూస్తున్నాం. దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని చంద్రబాబు పేరు వినిపిస్తుంది. జీవితాన్ని రెండు ఎకరాల నుంచి మొదలు పెట్టిన వ్యక్తి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా పేరు తెచ్చుకున్నాడంటే.. ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచేశాడో.. వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి వ్యక్తి దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని చంద్రబాబు పేరు చెబుతున్నారు. దేశంలోనే అత్యంత పేద రైతు ఆంధ్రరాష్ట్ర రైతులేనని నా బార్డు రిపోర్టు చెబుతుంది. 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంటే వడ్డీలతో తడిసి మోపెడై రూ. 28 వేల కోట్లకు ఎగబాకిన పరిస్థితిని స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటీ నివేదికలు చెబుతున్నాయి. దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని చంద్రబాబు పేరు వస్తుంటే.. మరోపక్క రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య రెట్టింపు అయిందని ఏ గ్రామంలో చూసినా కనిపిస్తుంది. బాబు బాగుంటే.. రాష్ట్రం బాగున్నట్లా.. లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా.. గతంలో జాబు రావాలంటే బాబు రావాలని గతంలో చంద్రబాబు అన్నాడు. ఐదేళ్ల తరువాత అడుగుతున్నా.. జాబు రావాలంటే బాబు పోవాలి అని ప్రజల నోట్లో నుంచి మాట వినిపిస్తుంది. ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెమ్మలను చూడండి.. డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నాడు. ఇంటింటికీ ఉద్యోగం, ఉపాధి అన్నాడు.. ఇవ్వలేకపోతే రూ. 2 వేల భృతి నెల నెల ఇస్తానన్నాడు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కానీ, తన కొడుకు లోకేష్‌కు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చి ప్రమోషన్‌లో మంత్రిగా కూడా చేశాడు. 

చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు ఇచ్చాడా.. లేక ఊడగొట్టాడా అని ఆలోచన చేయాలి. బాబు వచ్చాడు.. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల 3 వేల ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు వెయ్యి మంది గోపాల మిత్ర ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు ఆయుష్‌లో 8 వందల మంది ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు సాక్షరభారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు గోవింద, మధ్యాహ్న భోజన కార్మికులుగా ఉన్న 85 వేల మంది ఉద్యోగాలు గోవింద, బాబు వచ్చాడు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాలు ఇప్పటికీ ఇవ్వలేదు, వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు బంద్, ఉద్యోగులు తమ జీపీఎఫ్‌ డబ్బులు తీసుకునేందుకు లేకుండా ఆంక్షలు పెట్టాడు. హోంగార్డు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్టీ, ఎస్టీ, బీసీ సంస్థలకు, గురుకులాలకు, సర్వశిక్ష అభియాన్‌కు, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న వారికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. బాబు వచ్చాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్‌ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు బంద్, ఫీజురియంబర్స్‌మెంట్‌ కింద ఇప్పటికీ రూ. 18 వందల కోట్ల బకాయిలు పెండింగ్‌. బాబు వచ్చాడు. మధ్యాహ్న భోజన పథకానికి కనీసం సరుకులు కొనడానికి కూడా డబ్బులు ఇవ్వకుండా, పిల్లలకు అన్నం పెట్టకుండా ఎండగడుతూ అన్యాయం చేస్తున్నాడు. బాబు వచ్చాడు సీపీఎస్‌ నిధులను సంబంధిత నిధికి జమ చేయకుండా పూర్తిగా వాడేశాడు. బాబు వచ్చాడు పోలీసులకు టీఏలు, డీఏలు పూర్తిగా బంద్‌ చేశారు. ఇలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే కనీసం రేషన్‌ అయినా ఇస్తాడా అని అడుగుతున్నా.. 

 

57 నెలలు అన్యాయాలు చేసి, చివరి మూడు నెలలకు మాత్రం రాష్ట్రంలో కోటీ 75 లక్షల కుటుంబాలు ఉంటే కేవలం రూ. వెయ్యి నిరుద్యోగ భృతి అంటూ సినిమాలు చూపిస్తున్న వ్యక్తిని ఏమనాలో ఆలోచన చేయండి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలో నిరుద్యోగులు పడుతున్న బాధలు విన్నాను. ఆ ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను. మీ బాధలు నేను విన్నాను. మీ కష్టాలను నేను చూశాను. నేను ఉన్నానని మాటిస్తున్నాను. రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అక్షరాల 2.30 లక్షలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్‌ కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా అని అడుగుతున్నా.. ప్రతి నిరుద్యోగికి చెబుతున్నా.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు మొత్తం రిలీజ్‌ చేస్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ వచ్చే సరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ కూడా రిలీజ్‌ చేస్తాం. 

మన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ తెరుస్తాం. మీ ఊరులోనే చదువుకున్న 10 మంది పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నా..  పెన్షన్, రేషన్, ఇల్లు, ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్, నవరత్నాల్లోని ఏది కావాలన్నా.. అప్లికేషన్‌ పెట్టండి.. 72 గంటల్లో మంజూరు అయ్యేలా చేస్తాం. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడమని హామీ ఇస్తున్నా. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌ను తీసుకుంటాం. ఆ గ్రామ వలంటీర్లకు నెలకు రూ. 5 వేల వేతనం ఇస్తాం. ఆ గ్రామంలో ఉన్న వలంటీర్‌ గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమై ఆ ఇళ్లకు ప్రతి సంక్షేమ పథకం డోర్‌ డెలవరీ చేస్తాడని హామీ ఇస్తున్నా. ఎవరి చుట్టూ ఎవరు తిరగాల్సిన పనిలేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. 50 ఇళ్లకు వలంటీర్, గ్రామ సెక్రటేరియట్‌ పెట్టి ప్రతి పథకాన్ని మీ ఇంటికి నేరుగా అందజేస్తామని మాటిస్తున్నా..

అంతేకాదు ఇంకొక అడుగు ముందుకువేసి గవర్నమెంట్‌ కాంట్రాక్టులు చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రై వేట్‌ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఆ ప్రై వేట్‌ బస్సుల కాంట్రాక్ట్‌ జేసీ బ్రదర్స్, కేశినేని ట్రావెల్స్‌కు అప్పగిస్తున్నారు. ఇది పూర్తిగా మార్చేస్తాం. ఏ గవర్నమెంట్‌ కాంట్రాక్టులో అయినా సరే బస్సులు, కార్లు, అన్ని నిరుద్యోగ యువతకే ఇస్తామని హామీ ఇస్తున్నా. ఆ నిరుద్యోగ యువత కార్లు అద్దెకు పెట్టాలన్నా.. దాని కోసం పెట్టుబడి కింద సబ్సిడీ కూడా ఇస్తామని హామీ ఇస్తునాన.. అంతేకాదు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నిరుద్యోగ యువతకు ఇచ్చే ఈ లబ్ధి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు 50 శాతం చెందేలా చేస్తాం. 

అంతేకాకుండా పరిశ్రమల కోసం మన భూములు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు మాత్రం మన పిల్లలకు రావడం లేదు. వాచ్‌మెన్, ఆఫీస్‌బాయ్‌ ఉద్యోగాలు ఇస్తున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి శాసనసభలోనే ఒక చట్టం తీసుకువస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే చట్టంలో తీసుకువస్తాం. అంతేకాకుండా.. మన పిల్లలు ఆ పరిశ్రమల్లో పనిచేయడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు తీసుకొస్తా.. పరిశ్రమల్లో ఉద్యోగాలను బట్టి ఉచితంగా ట్రైౖ నింగ్‌ ఇస్తారు. 

చివరగా ఉద్యోగాల విప్లవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక హోదాను సాధించుకుందాం. హోదా సాధించాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యం కాదు.. జగన్‌కు మీ తోడు కావాలి. 25 ఎంపీ స్థానాలు మీ చల్లని దీవెనలతో సాధిస్తే ప్రత్యేక హోదా ఇచ్చిన తరువాతే మద్దతు తెలిపే కార్యక్రమం చేస్తాం. మన 25 మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది జత అయితే.. మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి హోదా ఇవ్వాల్సిందేనని కేంద్రంలో వచ్చే ఏ ప్రభుత్వానికైనా మద్దతు ఇస్తాం. ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వానికి సరైన నెంబర్‌ రాదు. అటువంటి పరిస్థితుల్లో 42 మంది ఎంపీలు ఒక్కతాటిపై నిలబడితే.. ప్రధానమంత్రి ఎవరైనా ఉండనీ,, సంతకం పెట్టి తీరాల్సిందే. ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదు కాబట్టే పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు వస్తాయి. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందని మాటిస్తున్నా.. 

నవరత్నాలతో ఏమేం మేలు జరుగుతుందని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు కుట్రలో భాగంగా గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్రయత్నం చేస్తాడు. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో మీరంతా ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అవ్వ, తాతను, ప్రతి అన్నను కలవండి. డబ్బులకు మోసపోవద్దు 10 రోజులు ఓపిక పట్టండి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.. నవరత్నాలతో ప్రతి ఇంటిలో సంతోషం నింపుతాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

 

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని, విశ్వసనీయ పదానికి అర్థం తీసుకురావాలని కోరుతున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని కోరుతున్నా.. రాజకీయ నాయకుడు మైక్‌ పట్టుకొని ఏదైనా చెబితే.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట నెరవేర్చకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే మార్పు వస్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం కూడా వస్తుంది. అలాంటి మార్పును కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మన లోకల్‌ హీరో గ్రంధి శ్రీనుకు మీ చల్లని ఆశీస్సులు ఇవ్వాలి. అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు అన్నను నిలబెడుతున్నాను.. మీ అందరి చల్లని దీవెనలు వీరిద్దరిపై ఉంచాలని పేరు పేరునా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని మర్చిపోవద్దు. 

 

Back to Top