విజయనగరం జిల్లా: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆయన గుర్లకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్బంగా వైయస్ జగన్‌కు వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులు వైయస్ జగన్ కోసం వచ్చారు. కాగా, కొద్దిరోజులుగా గుర్లలో డయేరియా కారణంగా పదుల సంఖ్యలో మరణాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు.