పులివెందుల చేరుకున్న వైయ‌స్  జగన్ 

  హైదరాబాద్‌: తన బాబాయ్ వైయ‌స్‌ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే  హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు. బాబాయ్‌ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు  వ‌చ్చారు వైయ‌స్ వివేకానంద‌రెడ్డి పార్థీవ దేహాన్ని చూసి చ‌లించిపోయారు. నివాళుల‌ర్పించి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

Back to Top