గ‌ణ‌నాధుని పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వినాయ‌క చ‌వితి వేడుక‌లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వినాయకచవితి సందర్భంగా జరుగుతున్న గణనాధుని పూజా కార్యక్రమంలో పార్టీ అధినేత‌, మాజీ సీఎం వైయస్‌ జగన్ పాల్గొన్నారు.  బుధ‌వారం  పార్టీ కేంద్రకార్యాలయంలో   వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్‌‌ జగన్‌  గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వైయస్‌ జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో  పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, కల్పలత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, నందిగం సురేష్‌, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన వెంకట మహేష్‌, దొంతిరెడ్డి వేమారెడ్డి, కొమ్మూరి కనకారావు, నారాయణమూర్తి సహా పార్టీ నేతలు హాజరయ్యారు.

Back to Top