తాడేపల్లి : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైయస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమని వైయస్ జగన్ కొనియాడారు.