ఒకేసారి 2 లక్షల 30 వేల ఉద్యోగాలు 

ఇంద్రపాలెం సభలో వైయస్‌ జగన్‌

కాకినాడ స్మార్ట్‌సిటీ అన్నారు..అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి దిక్కులేదు

ప్రతి గ్రామంలోనూ, వార్డుల్లోనూ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తాం

50 ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లు పనిచేస్తారు

ఏ పథకం కావాలన్నా 72 గంటల్లో మంజూరు చేస్తాం

స్థానికంగా నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు

హోదా ఎవరైతే ఇస్తారో కేంద్రంలో వారికే మద్దతు

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఒకేసారి విడుదల చేస్తామని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన ఉద్యోగాల క్యాలండర్‌ విడుదల చేస్తామని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకువస్తామన్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని ఇంద్రపాలెం సభలో ఏర్పాటు చేసిన సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. 

  • ఇదే నియోజకవర్గం గుండా నా పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది. ఇదే కాకినాడను స్మార్ట్‌ సిటీ చేస్తామన్నారు..కనీసం అండర్‌ గ్రౌండ్‌ కూడా నిర్మించలేకపోయారు. తూర్పు గోదావరిని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. 19 నియోజకవర్గాలున్న జిల్లాలో 14 ఎమ్మెల్యేలను టీడీపీ తరఫున గెలిపించారు. ఇది సరిపోదన్నట్లుగా మరో ముగ్గురు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు చేసింది ఏమిటని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ కనీసం స్మాల్‌æఇండస్ట్రీ కూడా రాని పరిస్థితి. ఉద్యోగాలు లేవని, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మాట దారిపొడవునా విన్నాను.
  •  ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో మన పిల్లలకు ఏమైనా మంచి జరిగిందా? ఆరోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్న మాట..జాబు రావాలంటే..బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. అక్షరాల ఐదేళ్ల పాలనలో రూ.1.20 లక్షలు చంద్రబాబు బాకీ పడ్డారు. రాష్ట్రం విడిపోయేనాటికి 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారు. ఈ పెద్ద మనిషి ఉద్యోగం ఇస్తారేమో అని కోచింగ్‌ సెంటర్లలో వేలకు వేలు డబ్బులు తగిలేస్తున్నారు. ఇంతవరకు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. ప్రత్యేక హోదా అన్నది మనకు వచ్చి ఉంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అయ్యేది. హోదా వస్తే ఇన్‌కంట్యాక్సీ కట్టాల్సిన పని లేదు. హోదా వస్తే ఆసుపత్రులు, హోటల్స్‌ వస్తాయి. ఇవన్నీ తెలిసీ కూడా చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి ఒక్కసారి కూడా హోదా కోసం అడగలేదు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ డిమాండు చేయలేదు. ఐదేళ్లలో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చదువులు అయిపోయిన ప్రతి పిల్లాడు అన్నా..జాబు అన్నా అంటున్నారు. మీ కష్టాలు చూశాను., మీ బాధలు విన్నాను. మీ అందరికి నేనున్నానని మాటిస్తున్నాను. 
  • జాబుల విషయంలో మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగాల కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. మనం వచ్చాక ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా జగన్‌ అనే నేను భర్తీ చేస్తానని మాటిస్తున్నాను. ప్రతి ఏటా జనవరి1వ తేదీ ఉద్యోగాల కేలండర్‌ విడుదల చేస్తాం. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ గ్రామ సెక్రటేరియట్‌ తీసుకువస్తాను. మీ ఊర్లోనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఇవాళ పింఛన్‌ కావాలన్నా..రేషన్‌కార్డు, ఇల్లు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వాలి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ ఊర్లోనే పది మందికి ఉద్యోగం ఇస్తాం. మీకు ఏమి కావాలన్నా..నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా కూడా 72 గంటల్లోనే మీకు మంజూరు చేస్తాం.
  • జాబుల విషయంలో మరో అడుగు ముందుకు వేస్తాం. ఇదే గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా గ్రామ వాలంటీర్‌గా నియమిస్తాను. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఏర్పాటు చేస్తాం. వీరికి రూ.5 వేలు గౌరవవేతనం ఇస్తాం. వారంతా కూడా గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానమైన అన్ని పథకాలను డోర్‌ డెలివరీ చేస్తారు. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. కులం చూడం..మతం చూడం. పార్టీలు కూడా చూడమని మీ అందరికి హామీ ఇస్తున్నాం. 
  • ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఇవాళ బస్సులు, కార్లు కాంట్రాక్టుకు ఇచ్చేవి ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి కేశినేని, జేసీ ట్రావెల్స్‌ గుర్తుకు వస్తారు. గవర్నమెంట్‌ కాంట్రాక్టులు అన్నీ కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్టం తెస్తాం, ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇవాళ మన రాష్ట్రంలో పరిశ్రమలకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మార్చేస్తాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సభలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేవిధంగా చట్టం చేస్తాం. పరిశ్రమల్లో ఎటువంటి వారికి ఉద్యోగాలు రావాలి..ప్రతి జిల్లాలో స్కీల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
  • దేవుడిదయ, మీ అందరి ఆశీస్సులతో 25కు 25 ఎంపీ స్థానాలు వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలుచుకొని..రేపు పొద్దున తెలంగాణలో 17 మంది ఎంపీలు కూడా ప్రత్యేక హోదా సాధనకు మనకు తోడుగా ఉంటే..ఏపీకి హోదా ఇవ్వాలన్న నినాదం పెద్దది అవుతుంది. కేంద్రంలో ఇవాళ ఏ ఒ క్క పార్టీకి కూడా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాకు మద్దతిస్తు సంతకం చేస్తే వారికే సపోర్టు చేస్తాం. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి. ప్రతి జిల్లా హైదరాబాద్‌ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మన పిల్లలకు ఉద్యోగలు ఇక్కడే దొరుకుతాయని నమ్ముతున్నాను. 
  • చంద్రబాబు కుట్రలు చూస్తున్నారు. ఈ రోజు టీవీలన్నీ కూడా రోజుకొక కుట్ర పన్నుతున్నారు. రోజుకొక  అబద్ధాన్ని వండి కుట్రలు చూపిస్తున్నారు. ప్రతి రోజు ఒక పుకారు లేపుతారు. దాని మీద చర్చ పెడతారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసి ^è ర్చ జరుగకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక్క చంద్రబాబుతోనే కాదు ..ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, అమ్ముడుపోయిన అనేక చానల్స్‌తో మనం యుద్ధం చేస్తున్నాం. 
  • ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్‌ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైయస్ఆర్  చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైయస్ఆర్ సీపీ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి వంగా గీతాను ఆశీర్వదించమ’ని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top