నాన్న‌గారు మ‌ర‌ణం లేని మ‌హానేత 

ఇడుపుల‌పాయ‌:  నాన్న‌గారు, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం లేని మ‌హానేత అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను  ప్ర‌వేశపెట్టి వాటి ఫ‌లాల‌ను ప్ర‌తి పేద‌వాడికి అందించిన గొప్ప వ్య‌క్తి.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్య దైవం.. డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా త‌న తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ఆర్‌ను స్మ‌రించుకుంటూ నివాళులర్పించారు. 
"నాన్న‌గారి 71వ జ‌యంతి నేడు. ఆయ‌న మ‌ర‌ణం లేని మ‌హానేత‌. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవ‌లు, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, రైతుల‌కు ఉచిత విద్యుత్‌, జ‌ల‌య‌జ్ఞం.. ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.. రైతు ప‌క్ష‌పాతి అయిన మ‌హానేత జ‌యంతిని రైతు దినోత్స‌వంగా జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది" అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top