డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతి పట్ల శ్రీ వైయస్‌ జగన్‌ సంతాపం

తాడేప‌ల్లి: ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు గారి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

పోలియో బాధితులకు లక్షలాది శస్త్రచికిత్సలు చేసి, వేలాది మందికి నడక నేర్పిన గొప్ప వైద్యుడు డా. ఆదినారాయణ రావు అని శ్రీ వైయస్‌ జగన్‌ కొనియాడారు. పోలియో రోగులు, వికలాంగుల కోసం లక్షకు పైగా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా 2022లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించిందని గుర్తు చేశారు.

పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా వైద్యరంగంలో అంకితభావంతో పనిచేసిన డా. ఆదినారాయణ రావు గారి మరణం సమాజానికి తీరని లోటు అని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top