తాడేపల్లి : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు . ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్‌కు వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైయస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. వైయస్ఆర్‌సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైంది దీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుంది గత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారు ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారు మన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదు ప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉంది మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాం చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడు మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి వాటికి వడ్డీలు కూడా ఉన్నాయి వీటికితోడు కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయి ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదు శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదు కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదు ఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాం ఐదేళ్లపాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించాం పథకాలను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం ప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడు చెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడు ఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదు రెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది ప్రతి ఇంట్లో కూడా.. వైయస్ జగనే ఉండి ఉంటే.., వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోంది ఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్‌మెంట్‌నేరుగా ఖాతాల్లో పడేది వసతి దీవెన కూడా అందేది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదు పథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవి ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారు స్కూళ్లలో టోఫెల్ పీరియడ్‌ను ఎత్తివేశారు ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదు మధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యింది డిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టే ఇప్పుడు ఆర్డర్‌కూడా ఇవ్వలేదు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతింది ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటింది ప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాం ఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోంది ఆరోగ్య ఆసరా ఊసే లేదు మందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదు ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు రైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్ పక్కనపడేశారు ఉచిత పంటల బీమాను వదిలేశారు బియ్యం డోర్ డెలివరీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది గ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారు మీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారు దిశ యాప్ ఏమైందో తెలియడంలేదు దిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారు అన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయి ఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాం ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి చంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కష్టాలు లేకుండా సృష్టే ఉంటుంది చీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుంది రాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుంది నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాం మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్ష పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడు చంద్రబాబు సహజ నైజం ఇది కాదు ఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడు నీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడు అందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడు అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడు కాని ధర్మం, న్యాయం గెలిచింది మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదు సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పు కాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది.