పైడితల్లి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలి

 సిరిమానోత్సవం సందర్భంగా భక్తులకు వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

 తాడేపల్లి: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారమైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా సందేశాన్ని పంచుకున్న వైయస్‌ జగన్‌, సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 

Image

Back to Top