మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి

విజయనగరం నుంచి దివ్యాంగుడు బైక్ యాత్ర  
 

పశ్చిమ గోదావరి జిల్లా: 2024 ఎన్నికల్లో మళ్లీ జగనన్న ప్రభుత్వమే విజయం సాధించాలనే లక్ష్యంతో బైక్‌ యాత్ర చేస్తున్నానని విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగుడు మాడెం అప్పారావు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామానికి చెందిన అప్పారావు ఈనెల 4న ఇచ్చాపురం నుంచి విజయవాడకు బైక్‌ యాత్ర ప్రారంభించారు.

తణుకు మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన బైక్‌ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆర్థికసాయం అందచేశారు. కార్యక్రమంలో కె.ఇల్లింద్రపర్రు సొసైటీ అధ్యక్షులు మల్లిరెడ్డి నాగార్జున, వైయస్ఆర్‌సీపీ పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. 

Back to Top