రేపు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ప్రచారం

అమరావతి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 9.30 గంటలకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో పర్యటిస్తారు. పదకొండున్నరకు ఎమ్మిగనూరులో, మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో ప్రచారం నిర్వహిస్తారు. అదే రోజు మూడున్నర గంటలకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

వైయస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచారం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ శనివారం ప్రకాశం జిల్లా ఎ్రరగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

వైయస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం
వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల శనివారం గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు.

Back to Top