వైయస్‌ జగన్‌ దళితుల పక్షపాతి

చంద్రబాబుకు ప్రజలు రాజకీయ సమాధి కడతారు..

వైయస్‌ర్‌ఆర్‌సీపీ పాలనలో సామాజిక న్యాయం

ఎన్ని కుట్రలు చేసినా వైయస్‌ఆర్‌సీపీ గెలుపును ఆపలేరు

వైయస్‌ఆర్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

విజయవాడ: రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం రాబోతుందని, ప్రతి ఇంటికి వెలుగులు వస్తాయని వైయస్‌ఆర్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌ బాబు అన్నారు.రాష్ట్రంలో సమానమైన సామాజిక న్యాయం జరగబోతుందన్నారు.అట్టడుగు,పేద వర్గాలను రాజకీయంగా అందలం ఎక్కిచే నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు. దళిత వర్గాల పక్షపాతి అని ఆయన నిరూపించుకున్నారన్నారు.అతి సామాన్య కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్‌ను బాపట్ల పార్లమెంటు స్థానం అభ్యర్థిగా ప్రకటించారన్నారు.అలాగే సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను ఆలనాడు వైయస్‌ఆర్,వైయస్‌ జగన్‌ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా చేశారని, నేడు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారన్నారు. ఇది వైయస్‌ఆర్‌ కుటుంబం చరిత్ర అని  అన్నారు. చంద్రబాబు కుటుంబ చరిత్ర అంతా రక్త చరిత్ర అని,ధన దాహం,దోపిడీ, దొంగల ముఠా బాస్‌గా చెలామణి అవుతున్నారన్నారు. నిన్న జీవీ హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు. నిన్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును కలిశాడని,రేపో,మాపో పచ్చచొక్కా తొడుక్కొబోతున్నారని తెలిపారు.జీవీ హర్షకుమార్‌ కళ్లు తెరిచి చూడాలన్నారు.కారంచేడు,చుండూరు మరణకాండ ఎవరి హయాంలో జరిగాయో,ఎవరూ దళితులను ఊచకోత కోశారో,తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ అంబేద్కర్‌ యువజన సంఘాల మీద దాడుల జరిగాయో మరిచిపోయావా అని ప్రశ్నించారు. హర్షకుమార్‌ జాగ్రత్తగా  మాట్లాడాలన్నారు. తండ్రి మరణాన్ని అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడే వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాదని, ఆయన ఇంట వంట లేదని గమనించి మాట్లాడాలన్నారు.వైయస్‌ఆర్‌ కుటుంబంపై బురద చల్లడం పద్దతి కాదన్నారు.ఒక నిజాయతీ గలనాయకుడుకి,కుయక్తులు గల నాయకుడికి మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ఇలాంటి తరుణంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.పనితీరు,మాట తీరు, ప్రజల పట్ల తీరుపై సర్వేలు జరగాయని గెలుపుబాటలో ఉన్నవారికే సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. ధర్మాన ప్రసాదరావు,నందిగం సురేష్‌లు బలహీనవర్గాల సీనియర్‌ నాయకులని ఆంధ్రరాష్ట్రం ప్రజలు గమనించాలి. చంద్రబాబు ఎన్ని కుట్రలు,కుతాంత్రలు చేసిన రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ గెలుపును ఆపలేరని, గెలుపు జెండా ఎగరవేయబోతుందన్నారు.ప్రజలు చంద్రబాబుకు రాజకీయ సమాధి కడతారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top