కాసేపట్లో గడప గడపకు ప్రభుత్వంపై వర్క్ షాప్

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో కాసేపట్లో గడప గడపకు ప్రభుత్వంపై వర్క్ షాప్ ప్రారంభం కానుంది.  ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడంతో పాటు.. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా.. ఏవైనా సమస్యలు ఉంటే తక్షణం తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే, మంత్రులతో గడప గడపకు ప్రభుత్వం పేరిట కార్యక్రమాన్ని వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం ప్రారంభించింది.  గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్  నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.  

తాజా వీడియోలు

Back to Top