ఎన్‌ఐఏ అంటే ఎందుకు భయం

జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉన్నందునే, విచారణకు సహకరించకుండా తప్పించుకుంటున్నారు.

అనంతపురం: ఎన్‌ఐఏ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. అందుకే విచారణకు సహకరించకుండా తప్పించుకుంటున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణకు సహకరించాలన్నారు. ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్ఛాపురం వరకు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర ఒక చారిత్రక ఘట్టమన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ప్రజలు సమాధి కడతారన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌కు ప్రజలు పట్టం కడతారని, రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. 

Back to Top