`బనకచర్ల`కు క్లాప్ కొట్టేది ఎప్పుడు బాబూ?

 వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి  సూటి ప్ర‌శ్న‌

అన్న‌మ‌య్య జిల్లా:  డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగా బ‌న‌క‌చ‌ర్ల అనే కొత్త సినిమాను తెర‌పైకి తెచ్చిన చంద్ర‌బాబు..ఈ సినిమాకు  క్లాప్ కొట్టేది ఎప్పుడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి  సూటిగా ప్ర‌శ్నించారు.  బనకచర్ల తో గేమ్ చేంజర్ అంటూ చంద్ర‌బాబు ఊద‌ర‌గొడుతున్నాడ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. శ‌నివారం రాయ‌చోటిలో శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`రాష్ట్రంపై లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్ర‌బాబు పాల‌న‌ను గాలికోదిలేసి కమీషన్లు, అవినీతి దందాలు చేసి స్వంత లాభం కోసం కేవలం అమరావతి కోసం ఖర్చు పెడుతున్నారు. బనకచర్ల అనే కోత్త సినిమా చూపిస్తానంటున్నావ్? .దానికి క్లాప్ ఎప్పుడు కోట్టేది లేదు. ఆ సినిమా హిట్ అయ్యేది లేదు? రాయలసీమ ప్రజలను ఉరించడానికే బనకచర్ల జ‌పం చేస్తున్నారు. 83 వేల కోట్లు కాదు గడికోట రిజర్వాయర్ నుంచి కాలేటి వాగు మీదుగా చేపట్టిన ప్రాజక్టు ద్వారా ప్రతి ఇంటికి కులాయి పథకాన్ని మేము ప్రారంభిస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకెళ్ళలేదు. రాష్ట్రానికి రాజధాని అవసరమే, అమరావతి కి మేము వ్యతిరేకం కాదు. మిగిలిన ప్రాంతాలను గాలికోదిలేయడాన్ని ప్రశ్నిస్తున్నాం. అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకోంటున్నారు, వాటిని నిలదీస్తున్నాం. అప్పేమో రాష్ట్రం మొత్తం మీద, అభివృద్ధి కేవలం అమరావతి మీదా? ఇదెకడి న్యాయం` అంటూ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

Back to Top