ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటాం

వైయ‌స్ఆర్‌సీపీ నేత కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ‌:నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలుగా  ప్ర‌జ‌ల్లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ కొత్త‌గా ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం అవ్వాల్సిన ప‌నిలేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు.వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ద్వారా అవిశ్రాంతంగా ప్ర‌జ‌ల‌తో మమేక‌మ‌య్యార‌న్నారు.ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో  మొట్ట‌మొద‌టి స‌మ‌ర శంఖారావం స‌భ కాకినాడ‌లో జర‌గ‌బోతుంద‌న్నారు.ఈ స‌భ ప్రాధాన్య‌త సంత‌రించుకుంద‌న్నారు.రేపు జ‌ర‌గ‌బోయే స‌మ‌ర శంఖారావాన్ని శుభ సూచికంగా భావిస్తున్నామ‌న్నారు.తూర్పు మార్పుకు సంకేత‌మని..తూర్పు నుంచి ప్రారంభ‌మ‌యింద‌ని భావిస్తున్నామ‌న్నారు.రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను గెలుచుకుంటామ‌న్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top