మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే

ఉద్రిక్తతలు సృష్టించిన వారిపై కఠిన చర్యలకు కోరుతున్నాం

 జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు 

 గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్‌ రెడ్డి

నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

ప‌ల్నాడు: మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే అని , జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్‌ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిప‌డ్డారు. మాచర్లలో రాళ్లతో, బరిసెలతో, మోటారు బైకులమీద పక్కా పథకం ప్రకారం సామాన్య ప్రజలమీద దాడిచేసింది ఎవరు? నేరుగా మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జే ఈ విధ్వంసంలో సూత్రధారి, పాత్రధారి. ఇది చంద్రబాబుకు తెలిసే జరిగింది. ఎందుకంటే.. ఇటీవలే మాచర్ల సహా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు అక్కడివారిని ఎంతగా రెచ్చగొట్టాడో, దాడులు చేయాల్సిందిగా బహిరంగ సభల్లోనే ఎలాంటి సందేశం ఇచ్చాడో అందరికీ తెలుసు. కాబట్టి మాచర్లలో ఇదేం ఖర్మ అంటూ బాబు మనుషులు వస్తుంటే.. స్థానిక ప్రజలు జగనన్న పరిపాలనలో తమకు మేలే జరిగిందని, స్కీంలు- అవినీతిలేకుండా, పక్షపాతం లేకుండా అందాయని చెప్పడంతో తట్టుకోలేని టీడీపీ నాయకులు ఒక పథకం ప్రకారమే మాచర్లలో దాడికి దిగారు. అంతేకాక ప్రజలను కలవడానికి వెళ్తున్న ఏ నాయకుడైనా కత్తులు, రాడ్లు, బరిసెలు తీసుకుని వెళ్తారా? మేం ఇది చేశామని చెప్పుకోవడానికో, అవతలి పార్టీ చేయలేదని చెప్పుకోవడానికో వెళ్లే పరిస్థితి పోయి రాళ్లు, కత్తులు, బడితెలు తీసుకెళ్లారంటే అర్థం ఏమిటి. సామాన్య ప్రజలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసిన తర్వాత దాన్ని వైయస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకుంటే,  ఎల్లోమీడియా దీన్ని మరోరకంగా చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇదంతా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిందంటూ పక్కాగా, పగడ్బందీగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. మాచర్ల ఘటనకు బాధ్యులైన టీడీపీ నాయకులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు శాఖను కోరుతున్నాం.

Back to Top