వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

వ్యర్థాల నుంచి గంటకు 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి.. 

రూ.345 కోట్లతో ప్లాంట్‌ నిర్మాణం

పల్నాడు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొండవీడు చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ ఘనస్వాగతం పలికారు. పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌ సమీపంలో మొక్కను నాటారు. అనంతరం ప్లాంట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు. వ్యర్థాల నుంచి గంటకు 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్‌ను రూ.345 కోట్లతో నిర్మించారు. ప్లాంట్‌ కోసం ప్రభుత్వం 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అదే విధంగా వ్యర్థాలను పూడ్చేందుకు మరో 52 ఎకరాలను కేటాయించింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top