ఎంపీ నందిగం సురేష్‌పై దాడిని నిరసిస్తూ ర్యాలీ

విజయవాడ: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ శుక్రవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. తాళ్లాయపాలెం మీదుగా విజయవాడ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ..జేఏసీ ముసుగులో ఉన్న టీడీపీ మహిళలు దళిత ఎంపీపై పథకం ప్రకారమే దాడి చేశారని మండిపడ్డారు. ముందుగానే కారం పొట్లాలు వెంట తెచ్చుకొని బస్సులో వచ్చి ఎంపీ కాన్వయ్‌పై చల్లారని, ఈ దాడులను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఓ పథకం ప్రకారమే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ దాడిని ఖండించాలని కోరారు. దాడిలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టాలంటే దళితులతో పాటు నందిగం సురేష్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
 
 

Back to Top