చంద్రబాబు దీక్ష పేరేంటో ఆయనకే తెలియదు

విజ‌య‌వాడ జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
 

విజయవాడ: చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికే తెలిచదని, దీక్ష పేరేంటో కూడా బాబుకు తెలియదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.  విజ‌య‌వాడ‌లో గురువారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో జ‌నాగ్ర‌హ దీక్ష చేప‌ట్టారు. ఈ దీక్ష‌లో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మ‌ల్లాది విష్ణు, త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌ల్లాది విష్ణు మాట్లాడుతూ.. నిన్నటి టీడీపీ బంద్‌ను ఆ పార్టీ నేతలే పట్టించుకోలేదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top