నీ జీవితంలో నిజం మాట్లాడారా బాబూ...

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

మీ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా చంద్రబాబూ అంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు. జమ్మలమడుగు సబలో వైయస్‌ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ప్రజలు మీపై అసహ్యసించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికే మొగ్గు అంటూ లగడపాటితో కలిసి మస్కా కొట్టబోతే ప్రజలు చెంప చెళ్లుమనే తీర్పు ఇచ్చారు. ఆ వాతలింకా మానలేదు. మళ్లీ మా బాబుకే పట్టాభిషేకం అంటూ అదే అస్థాన జ్యోతిషుడు ఓ దొంగ సర్వేతో ఆంధ్రుల కళ్లు కప్పబోయి బొక్కబోర్లా పడ్డాడు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

Back to Top