నీరో చక్రవర్తిని మరపించిన‌ చంద్రబాబు

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ పేరుతో చంద్రబాబు దావోస్‌లో ఏపీ లాంజ్ కోసం రూ.17 కోట్లు మంచి నీళ్లలా ఖర్చు చేయడంపై దర్యాప్తు జరగాలని రాజ్యసభ సభ్యుడు, వైయ‌స్ఆర్‌ సీపీ జాతీయ కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. నాలుగు 4 రోజుల భోజనాలకు రూ. 1.05 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారో తేలాలన్నారు. ‘రోమ్ తగలడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తిని మరపించారు చంద్రబాబు. నీటి కొరత, రోగాలు, కరువు, తుఫాన్లతో ఇక్కడ ప్రజలు విలవిల్లాడుతుంటే దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు ఐదేళ్లలో వంద కోట్లకు పైగా తగలేశారు. ఒరిగింది శూన్యం. ఒక్క పరిశ్రమ రాలేదు​’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

పారదర్శక పాలన అందించే విషయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి కొత్త దిశను చూపించారని ప్రశంసించారు. రూ. 100 కోట్లు దాటిన ప్రభుత్వ టెండర్లను న్యాయపరిశీలన తర్వాతే ఖరారు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట పడటంతో పాటు పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. టెండర్లలో అక్రమాలు, పక్షపాతం, అవినీతి అడ్డుకట్టకు ప్రభుత్వం ఇటీవల ఏపీ మౌలిక​ సదుపాయాలు(ముందుస్తు న్యాయపరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు-2019కి అసెంబ్లీ ఈ నెల 26న ఆమోదం తెలిపింది

తాజా ఫోటోలు

Back to Top