గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ సంక్రాంతి సంబరాలు

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు  

గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన పార్టీ నేతలు

గుంటూరు: గుంటూరు నగరంలోని శ్యామల నగర్‌లో ఉన్న మెట్టు కళ్యాణ మండపంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్  అంబటి రాంబాబు నేతృత్వం వహించి విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా గారు ప్రత్యేకంగా పాల్గొని మహిళలతో కలసి సంక్రాంతి ఉత్సవాలను మరింత ఉత్సాహంగా మలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ అందరి దృష్టిని ఆకర్షించాయి. ముగ్గుల పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు షేక్ నూరి ఫాతిమా గారు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. మహిళల సృజనాత్మకత, సంప్రదాయాల పరిరక్షణలో వారి పాత్ర ప్రశంసనీయం అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు  ఆర్కే రోజా గారు, రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్ రెడ్డి గారు హాజరై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమై, పండుగ ఆనందాలను పంచుకోవడం వైయ‌స్ఆర్‌సీపీ సంస్కృతి అని వారు పేర్కొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ప్రజలతో అనుబంధాన్ని చాటుతూ నిర్వహించిన ఈ సంక్రాంతి సంబరాలు గుంటూరులో విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back to Top