సమతుల్యం పాటించినప్పుడే  విజయవంతం అవుతారు

హరివంశ్‌ నారాయణ్‌కు విజయసాయిరెడ్డి అభినందనలు
 

న్యూఢిల్లీ: అధికార, విపక్షాలకు మధ్య సమతుల్యం పాటించినప్పుడే చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌గా విజయవంతం అవుతారని వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్య‌స‌భ‌ ఉప సభాపతిగా ఎన్నికైనా హరివంశ్‌ నారాయణ్‌కు విజ‌య‌సాయిరెడ్డి అభినందనలు, శుభకాంక్షలు తెలిపారు. గతంలోనూ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నికయ్యారని, వైయ‌స్ఆర్‌‌ సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు ఆయన మంచి సమయం కేటాయించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.   

Back to Top