బాబు పెత్తందారుల పక్షం.. వైయ‌స్ జగన్ గారు పేదల పక్షం

రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 

మా ప్రభుత్వంలో బీసీలకు అన్నింటా ప్రాధాన్యం

 బాబు ద్రోహంతో 11 తరాలు వెనుకబడ్డ బీసీలు

 బాబు హయాంలో కార్పొరేషన్ పదవులు కేవలం దోపిడీకే .. మా హయాంలో బీసీల సేవకే పదవులు.

ఈనాడు రామోజీ వాస్తవాలు తెలుసుకోవాలి

 తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పెత్తందారుల పక్షం.. సీఎం వైయ‌స్ జగన్ గారు పేదల పక్షమ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.  ఆ రోజు కురుక్షేత్రంలో ధర్మం పక్షాన యుద్ధం చేసింది వాసుదేవుడు...అదే మాదిరిగా ఈ రోజు పేదవాడి పక్షాన యుద్ధం చేస్తున్నది  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు. ఇది వారికి కంటగింపుగా ఉంది. ఈ రోజు పైసా రాల్చలేదని ఈనాడులో రాశారు.  రాష్ట్రంలో బీసీల ఈ స్థితికి కారణమెవరు?
  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేనాటికి
 బీసీల కష్టాలకు కారణమెవరు? మీరు రాతల ద్వారా పైకి ఎత్తాలనుకున్న చంద్రబాబు కాదా?  బీసీలను ప్రధానంగా పెద్ద సంక్షోభం నుంచి బయటపడేసింది మా ప్రభుత్వం తీసుకున్న దార్శనిక నిర్ణయాలు కాదా? అది ఏ రోజైనా రాశారా? మీరు ఏకపక్షంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా చెడుగా చూపుతున్నారు. ఈ పత్రిక లు చదివిన వెంటనే మనసులు కలచి వేసేలా రాతలు ఉంటున్నాయి. కళ్లెదురుగానే నిజాలు కనిపిస్తుంటే... అబద్ధాలను రాస్తారు. తద్వారా చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలన్నదే మీ లక్ష్యం. అదే మీ అజెండా.. బీసీల గురించి తెలుగుదేశం నాయకులు ఎవరు ప్రెస్‌ మీట్‌ పెట్టినా ... 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి,  అధికారులు లేరని, ఆఫీసులు లేవని ప్రచారం చేసేవారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి లో అయిపాయె ...అని ఒక  కథనం రాశారు. అందులో.. 56 బీసీ కార్పొరేషన్లకు 56 ఆఫీసులు ఉన్నాయని, అధికారులున్నారని  ఒప్పుకున్నారు. నిన్నటి దాకా ఆఫీసులు లేవని ఇదే పత్రిక ప్రచారం చేసింది. ఇవేం రాతలు..? చంద్రబాబు హయాంలో ఎన్నికలకు ముందు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆఫీసులు ఏర్పాటు చేయలేదు. జగన్‌ గారు చేయగలిగింది చెబుతారు...చెప్పింది చేస్తారు. పాలకులంటే పెత్తందార్లు కాదు...ప్రజాసేవకులని ఆయన పదే పదే చెబుతారు. మనం సేవకులం..పాలకులనే భావన మీలో ఉండరాదని మాకు ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ రోజు బాబు కోసం మీరు పడుతున్న తపన...మీరు రాస్తున్న అసత్య కథనాలు...సమాజం ఏమనుకుంటుందో మీకు ఆలోచన లేదే...

బాబు ద్రోహంతో 11 తరాలు వెనుకబడిన బీసీలు
           మొన్న జయహో బీసీ సభను 85 వేల మందితో నిర్వహిస్తే మీకు దడ పుట్టింది. ఆ రోజు లక్షమంది ఉన్న సభలో ఖాళీ కుర్చీలు ఉన్నాయని రాశారు.  తమ కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని బీసీలు తెలుసుకున్నారు. 14 ఏళ్ల బాబు పాలనలో తమకు చేసిన ద్రోహాన్ని బీసీలు గుర్తించారు. బాబు నిర్వాకంతో వారు 11 తరాలు వెనుకబడి పోయారు. వారు రుణగ్రస్తులుగా మిగిలిపోవాలని బాబు అనుకున్నారు.
బీసీలు రుణ విముక్తులుగా బతకాలని జగన్మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయన వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బీసీలు రుణగ్రసులుగా మిగిలిపోవాలని చంద్రబాబు ఆలోచన ..ఇప్పటికైనా నేను అడుగుతున్నాను. నీ కంటూ బీసీలకు ఒక ప్రత్యేక పథకాన్ని ఎప్పుడైనా ప్రవేశపెట్టావా బాబూ..?
నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు బీసీలకు సంక్షేమం ఒక్కటే చాలదని ఆలోచించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఈ రోజు అడుగుతున్నాను. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రాకముందు  బీసీల్లో  కులవృత్తుల్లో పనిచేసే వారి పిల్లలు  ఎవరైనా ఇంజనీరింగ్, డాక్టర్‌ కోర్సులు చదవగలిగారా?  వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అది సాధ్యమయింది. 
అప్పటివరకు ఒక్క ఎస్సీలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. 2014 –2019 కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సగానికి సగం తగ్గించింది బాబు కాదా..? ఆయన  ఫీజులు పెంచేసినప్పుడు ఈనాడుకు  కన్పించలేదా?
- రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్ల మీద టీడీపీ, దాని కుల మీడియా ఈరోజు రాసిన కథనాలు వారి పెత్తందారీ పోకడలను, అహంకారాన్ని మరోసారి బయటపెట్టాయి. 
- బీసీలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల వల్ల ఒక్క పైసా కూడా పనికాలేదని, ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం ముగిసిపోయిందని రాశారు. 
- ఈ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేశామన్నదీ, డైరెక్టర్లను ఎందుకు నియమించామన్నది ముందుగానే ముఖ్యమంత్రిగారు వెల్లడించడం జరిగింది. 
- బీసీ కార్పొరేషన్లు అయినా, ఎస్సీ కార్పొరేషన్లు అయినా, ఎస్టీ కార్పొరేషన్లు అయినా.. మొత్తంగా మా ప్రభుత్వంలో.. ఊరికొకరికి మాత్రమే మేలు చేసే గత ప్రభుత్వ దుర్మార్గం నుంచి బయటకు తీసుకొచ్చాం. 
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 139 బీసీ కులాల్లో ఉన్న ప్రతి పేదకు జగన్ గారి ప్రభుత్వం మేలు చేసింది. కాబట్టే, డీబీటీ-నాన్ డీబీటీ ద్వారా బీసీలకు ఏకంగా రూ. 1.64 లక్షల కోట్లు.. ఈ మూడున్నర సంవత్సరాల్లోనే వారి చేతుల్లో ఉంచగలిగామని వివరాలతో సహా ముఖ్యమంత్రి గారు చెప్పగలిగారు. 
- అంతేకాకుండా, మొత్తం డీబీటీ-నాన్ డీబీటీ కలిపితే.. ఈ మూడున్నర సంవత్సరాల్లోనే 3.21 లక్షల కోట్ల రూపాయాల ప్రయోజనాలు పేదలకు అందితే, అందులో సగం బీసీలకే వెళ్ళింది. 
- ఒక అమ్మ ఒడి కానివ్వండీ, ఒక రైతు భరోసా కానివ్వండీ, పెన్షన్లు కానివ్వండీ, ఆసరా కానివ్వండీ, చేయూత కానివ్వండీ.. ఇలా దాదాపు 36 పథకాల్లో ఏ పథకాన్ని తీసుకున్నా బీసీలకు ఈ మూడున్నరేళ్ళలో అందిన వాటా ఎంత..? ఈ పథకాలేవీ లేని టీడీపీ పాలనలో అందిన వాటా ఎంత అన్నది లెక్క చూసుకుంటే- 
- 5 ఏళ్ళ టీడీపీ పాలనలో మొత్తం రూ. 20 వేల కోట్లు కూడా ఖర్చు చేయని బాబు ప్రభుత్వం ఈనాడుకు గొప్పగా మంచిగా కనిపించింది.
- వారు చెప్పిన లెక్క ప్రకారమే టీడీపీ హయాంలో కార్పొరేషన్ల ద్వారా  కేటాయించిన మొత్తం కేవలం రూ. 1626 కోట్లు. సాయం పొందింది కేవలం 3.15 లక్షల మంది. 
- మరి ఈ మూడున్నరేళ్ళ కాలంలో అందిన మొత్తం ప్రయోజనాలు అంటే, ఒకే కుటుంబానికి మూడు, నాలుగు ప్రయోజనాలు కూడా కలిగి ఉండవచ్చు. ఇలా కేవలం బీసీలకు కలిగిన ప్రయోజనాలు 5 కోట్ల 4 లక్షలు. 
- వారు ఖర్చు చేసింది వందల కోట్లలో ఉంటే.. అదికూడా కొద్దిమందికే, అంటే వెయ్యిలో ఒకరికి కూడా ఇవ్వకుండా, పదివేలలో ఒకరికి కూడా ఇవ్వకుండా వారు ఖర్చు చేసిన రూ. 1600 కోట్లు ఎక్కడ.. జగన్ గారి ప్రభుత్వం ఖర్చు చేసిన,  ఈ 36 నెలల్లోనే అందించిన రూ. 1.64 లక్షల కోట్లు ఎక్కడ..?
- ఇలాంటి వాదనలు చేస్తున్నప్పుడు సిగ్గు కూడా అనిపించదా?

- అదీకాక, కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు ఉన్నది వారి వారి సామాజిక వర్గాల్లో నవరత్నాలు అందుకోలేక, ఎక్కడైనా మిగిలిపోతే, అర్హులకు ఎక్కడైనా లబ్ధి కలగకపోతే, వారి కులంలో అటువంటి వ్యక్తుల్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే వారి పని అని వారందరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే స్పష్టం చేయడం జరిగింది. 
- అంటే మా హయాంలో ఏ కులం కోసం.. ఆ కులం డైరెక్టర్లు, ఛైర్మన్లు కార్యకర్తల్లా పనిచేస్తారు తప్ప, టీడీపీ హయాంలో మాదిరిగా కులాన్ని దోచుకునే, కులం పేరు మీద దోచుకునే ఛైర్మన్లు, డైరెక్టర్లు మా దగ్గర లేరు. 

- ఏ ప్రభుత్వంలోనూ జరగని రాజకీయ న్యాయం కూడా జగన్ గారి ప్రభుత్వంలోనే జరిగింది కాబట్టే- మంత్రి మండలిలో 68 శాతం, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో మా బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చరిత్రలో ఎప్పుడూ, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనూ లేనంత ఎక్కువ మంది ఉన్న మాట వాస్తవం. 

- ప్రాంతాలవారీగా తీసుకుంటే- ఉత్తరాంధ్ర అన్నది మరింత ఎక్కువ బీసీలు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతానికి మూడింటిలో ఒక రాజధాని ఇవ్వటానికే వీల్లేదని వాదిస్తున్న పార్టీలు- బీసీ అనుకూల పార్టీలని ఎవరైనా భావిస్తారా..?

- నిజానికి, చంద్రబాబు తోకలన్నింటినీ కత్తిరించిన 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికల్లోనూ బీసీలు- టీడీపీ మీద దండయాత్ర, యుద్ధం ప్రకటించారు. 

- బీసీలకు ఆర్థిక, సామాజిక, విద్య, మహిళ, రాజకీయ న్యాయాలు ఈ ప్రభుత్వంలో దక్కినంతగా ఏ ప్రభుత్వంలోనూ దక్కలేదు. 
- పూలే, అంబేడ్కర్ ల కలలు నిజం అవుతున్న ఏకైక రాష్ట్రం మనది. 
- చంద్రబాబుది పెత్తందారీ, భూస్వామ్య ఆలోచన విధానం అయితే.. మాది రైతులు, పేదలు, కూలీలు, వెనుకబడిన వర్గాల ఆలోచనా విధానం కాబట్టే- బాబు తట్టుకోలేక ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేయాలని ఈనాడులో వార్తలు రాయించాడు. 
- బాబుకు తెలిసో, తెలియకపో ఎవరైనా ఓటు వేస్తే.. అది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి వ్యతిరేకంగా వేసిన ఓటే అవుతుంది.

బాబును మోస్తున్న రామోజీ, రాధాకృష్ణ
ఏ పెత్తందారు వద్దకు వెళ్లి యాచించాల్సిన పరిస్థితి నేడు లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది  మా ముఖ్యమంత్రి. రామోజీరావు, రాధాకృష్ణలూ...  కళ్లతో చూడండి. బాబును మోయడానికా మీ పత్రికలు పనిచేస్తున్నది? పేదవాడు అభివృద్ధి చెందితే మీకు కంటగింపుగా ఉంది. ఎవరినీ దేహీ అని యాచించాల్సిన పరిస్థితి లేకుండా జగన్మోహనరెడ్డి ఇంత చేశారు.  బాబు హయాంలో ఒక్క రాజ్యసభ స్థానాన్నయినా బీసీలకు ఇచ్చారా? రామోజీరావుకు, రాధాకృష్ణకు ఇది కన్పించలేదా? ఎప్పుడైనా మీరు  ఈ ప్రశ్నను బాబుకు వేశారా? అదే మా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు 9 రాజ్యసభ స్థానాలలో 4 బీసీలకు కేటాయించారు. వార్డు మెంబరు మొదలు  సర్పంచి, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, జెడ్పీ ఛైర్మన్లు,  ఇలా  కీలకమైన అనేక పదవులు జగన్మోహనరెడ్డి గారు మా బీసీలకు కేటాయించారు. బీసీల సమస్యల శాశ్వత పరిష్కారానికి బీసీ కమిషన్‌ వేసింది మా ప్రభుత్వం. బీసీ జనగణన కోసం శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది మనం చూశాం. విజయసాయిరెడ్డి గారు ప్రయివేట్‌ మెంబరు బిల్లు కింద బీసీ లకు 50 శాతం రిజర్వేషన్‌ ఉండాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ ఉండాలని అడిగిన మొట్టమొదట పార్టీ వైయ‌స్ఆర్‌సీపీనే.  
 ఈ రోజు మా  కేబినెట్లో 45 శాతం మంది అంటే 11 మంది మంత్రులు బీసీలే. నలుగురు రాజ్యసభ సభ్యులు, ఆరుగురు లోక్‌సభ సభ్యులున్నారు. 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 109 మంది కార్పొరేషన్‌ ఛైర్మన్లు ఉన్నారు. 873 కార్పొరేషన్‌ డైరక్టర్లు, 9 మంది జెడ్పీ ఛైర్మన్లు,
 98 మంది మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, 76 మంది వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్లు, 50 శాతం టెంపుల్‌ కమిటీ ఛైర్మన్లు, 9 మంది మేయర్లు,  215 మంది జెడ్పీటీసీలు, 2791 మంది ఎంపీటీసీలు, 3985 మంది సర్పంచులు, సుమారు 60 వేల మంది వార్డు సభ్యులు మా బీసీలు ఉన్నారు. సచివాలయాల్లో 1.31 లక్షల మంది పనిచేస్తుంటే అందులో 85 శాతం మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే. నామినేటెడ్, నామినేషన్‌ పనులు, పదవుల్లో 51 శాతం రిజర్వేషన్‌ అక్కచెలెళ్లకు కల్పించింది మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి గారు. మేము బీసీ రిజర్వేషన్లకు అడ్డం పడ్డామని అంటావా బాబూ... వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్‌ శాతం పెంచితే టీడీపీ కి చెందిన బిర్రు ప్రతాపరెడ్డిని సుప్రీం కోర్టుకు పంపించి అడ్డం పడింది నువ్వు కాదా? బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ దాటకూడదని అడిగించింది నువ్వు కాదా? ఈ వాస్తవాలు మీకు తెలియదా? అని ఈనాడును ప్రశ్నిస్తున్నాను. మీ పెత్తందారీ తనం పేదలపై ఎంత కాలం? వదిలేయండి ...ఇంకానా ఇక సాగదు. భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండవు. మీ రాతలతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అందరం మేం ప్రజలకు సేవకులం.

రాజకీయం అంటే కుట్ర, మోసం, కుతంత్రం, దగా.. చంద్రబాబు నైజం...రాజకీయం అంటే పేదలకు నమ్మకాన్ని ఇస్తున్నది జగన్మోహన్‌రెడ్డి . నిజాన్ని నిత్యం ప్రచారం చేయండని పౌరసమాజాన్ని కోరుతున్నాను. 

 పాలకుడు అందరి పట్ల సమభావంతో ఉండాలి. చంద్రబాబు ఎవరికీ ఏం చేయలేదు. బీసీలను రుణగ్రస్తులను చేసిన వ్యక్తి చంద్రబాబు. మనుషులకు ఉండాల్సింది మానవత్వం. ఆ మానవత్వం మా పాలనలో ఉంది. సమాజంలో సమున్నతంగా ఉంచేది విద్య.  సుమారు 4 లక్షల మంది మా బీసీఎస్సీఎస్టీ పిల్లలకు ట్యాబ్‌లు జగన్‌ గారు ఇవ్వబోతున్నారు. బాబు ఏ రోజైనా ఆరోగ్యశ్రీ గురించి ఆలోచించారా? నిజం మాట్లాడే నాయకుడు జగన్‌ రూపంలో ఇప్పుడు దొరికారు . ఈ ప్రభుత్వం బీసీలకు కావాల్సిన సామగ్రిని అందిస్తున్నాం. బీసీలు ఈ రోజు తన ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టాల్సిన పనిలేదు. ఆ రోజు జన్మభూమి కమిటీలకు మొక్కితేనే పనులు అయ్యేవి. ఇప్పుడా మొక్కులు లేవు . అంతా పారదర్శకతమే కదా...నిజానికి –అబద్ధానికి ఇప్పుడు పోటీ...బీసీలకు అన్ని విధాలుగా చేయూత నిస్తున్నాం. వారు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో జీవించేలా చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యం.

Back to Top