దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపింది

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
 

 

విశాఖపట్నం: దిశ చట్టం మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఉమెన్స్‌ స్టడీ సెంటర్ల విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మ, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళల భద్రతపై దేశానికి మార్గం చూపించేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దిశ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. మహిళలపై నేరాలు పాల్పడిన క్రూర మృగాలు ఏళ్ల తరబడి శిక్షలను తప్పించుకుంటూ చట్టాలకే సవాళ్లు విసిరే పరిస్థితి ఉందన్నారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి 21 రోజుల్లో శిక్ష పడే విధంగా దిశ చట్టాన్ని తయారు చేసి దాని అమలు కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను మహిళా లోకం కృతజ్ఞతలు తెలుపుతుంది.

తాజా వీడియోలు

Back to Top